Begin typing your search above and press return to search.
తెలంగాణలో కరోనా ట్రీట్ మెంట్ ఇలా చేస్తున్నారట!
By: Tupaki Desk | 27 April 2020 1:30 AM GMTదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నా కరోనా విషయంలో తెలంగాణ వైపు చూస్తున్న వారెందరో. దీనికి కారణం లేకపోలేదు. దేశానికి కరోనా కేసులు వచ్చిన మొదటి మూడు రాష్ట్రా్ల్లో తెలంగాణ ఒకటి. అంతేనా.. ఎక్కువ కేసులు నమోదు కావటమే కాదు.. గడిచిన కొద్దిరోజులుగా తక్కువ కేసులు నమోదైన తీరుతో పాటు.. మొత్తం నమోదైన కేసులు.. అందులో చోటు చేసుకున్న మరణాల్ని చూసినప్పుడు తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం మరణాల రేటు దగ్గర దగ్గర 2.5 శాతమే ఉంది.
నిజానికి తెలంగాణలో చోటు చేసుకున్న కరోనా మరణాల్లో పెద్ద వయస్కులు ఎక్కువగా ఉండటం.. కరోనా వచ్చిందన్న అవగాహన లేక.. మామూలు వైద్యం చేయించుకుంటూ మరణించిన వారు లేకపోలేదు. వారు మరణించిన తర్వాత జరిపిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లుగా తేలిన వైనాన్ని చూసినప్పుడు.. కరోనా చికిత్స చేయించుకుంటూ తుదిశ్వాస విడిచిన వారి సంఖ్య జాతీయ సగటు కంటే చాలా తక్కువ.
ఇదంతా చూసినప్పుడు తెలంగాణలో కరోనా పేషెంట్లకు చేస్తున్న ట్రీట్ మెంట్.. వారికి చికిత్స విషయంలో అనుసరిస్తున్న విధానాలే కారణంగా చెప్పాలి. కరోనా పేషెంట్ల అందరికి ఒకేలా ట్రీట్ మెంట్ ఇస్తారా? వేర్వురుగా ఇస్తారా? అన్న సందేహం చాలామందిలో ఉంది. ఎందుకంటే.. దీన్ని నయం చేసేందుకు వ్యాక్సిన్ లేదు. అంతేకాదు.. కరోనా సోకిన వారందరికి ఒకేలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కొందరికి జ్వరం ఎక్కువగా ఉంటే.. మరికొందరికి గొంతు నొప్పి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇంకొందరికి విరోచనాలు ఎక్కువగా అవుతుంటాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్లకు ఏ తీరులో వైద్యం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ట్రీట్ మెంట్ కు సంబంధించిన తెలంగాణలో అనుసరిస్తున్న విధానాల గురించి గాంధీకి చెందిన వైద్యులు డాక్టర్ వినయ్ కుమార్.. ఛాతీ ఆసుపత్రికి చెందిన వైద్యుడు మహబూబ్ ఖాన్ లు ఒక మీడియా సంస్థకు వివరించారు. వీరు చెప్పిన దాని ప్రకారం.. కరోనా సోకిన పేషెంట్ రోగనిరోధక శక్తి ఆధారంగా చికిత్సను చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు పద్నాలుగురోజుల్లోనే ఈ వైరస్ బారి నుంచి విముక్తులు అయ్యే అవకాశాలు ఎక్కువ. కరోనా పాజిటివ్ గా తేలిన వారికి చేసే ట్రీట్ మెంట్ వారి వయసుకు ఆధారంగా చేస్తున్నారు. 15 - 50 ఏళ్ల లోపు వారిని ఏ కేటగిరిగా పరిగణిస్తారు. వీరికి కరోనా లక్షణాలు తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. వీరిలో 80 శాతానికి తక్కువ మోతాదులో చికిత్స సరిపోతుంది.
50-70 ఏళ్ల వారిని బి కేటగిరి కిందకు తీసుకొచ్చారు. వీరిలో శ్వాసకోశ సమస్యలు.. షుగర్.. బీపీ.. కిడ్నీ.. గుండె.. లివర్ సమస్యలు ఎక్కువగా ఉండే వారికి ప్రత్యేకంగా వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ వయసు వారిలో ఇతర జబ్బులు ఉంటే.. రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. 70 ఏళ్లకు పైబడిన వారిని సీ కేటగిరి కింద పరిగణిస్తారు. వీరిని నాలుగోదశ రోగులుగా ట్రీట్ చేస్తారు. వీరిలో ఎక్కువ మంది పలు సమస్యలతో ఉంటారు. ఇలాంటివారికి ట్రీట్ మెంట్ ఇచ్చే సమయంలో అత్యవసరంగా వెంటిలేటర్లపైచికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక.. నవజాత శిశువులు.. చిన్నారులకు వైరస్ సోకితే వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తారు. ఇలాంటి శిశువుల కోసం గాంధీలో ఆరో అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తారు. పాజిటివ్ గా తేలిన రోగులకు చికిత్సను వెంటనే షురూ చేయటంతో పాటు.. రోజుకు మూడుసార్లు జ్వరం ఎంత? బీపీ ఎంతన్న పరీక్షలు నిర్వహిస్తారు.
జ్వరం ఉన్న వారికి పారాసిటమాల్.. జలుబు ఉంటే సిట్రజిన్ ఇస్తుంటారు. వారిలో ఆ లక్షణాలు తగ్గిపోయిన వెంటనే మందులు ఇవ్వటం మానేసి.. రోగనిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సి.. బికాంప్లెక్స్ మందుల్ని ఇవ్వటం మొదలు పెడతారు. దగ్గు.. జలుబు.. జ్వరం తీవ్రత ఆధారంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ డోస్ లను కూడా ఇస్తారు. అయితే.. రోగికి ఉండే లక్షణాల ఆధారంగా సదరు వైద్యుడు ఏమేం ఇవ్వాలి? ఎంత ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. శ్వాస తీసుకోవటం కష్టంగా ఉన్నా.. ఆక్సిజన్ అందకపోవటం లాంటి సమస్యలు ఉంటే.. వారికి ఆక్సిజన్ తో పాటు.. వెంటిలెటర్ ఏర్పాటు చేస్తారు.
షుగర్.. బీపీలు ఉంటే వారికి తగిన మందులు ఇస్తారు. కరోనా పాజిటివ్ గా తేలిన వారికి పలు సందర్భాల్లో పలు టెస్టులు చేస్తారు. డిశ్చార్జి సమయంలోనూ రెండుసార్లు వరుసగా నెగిటివ్ వచ్చిన తర్వాతే డిశ్చార్జి చేస్తారు. వారం చికిత్స తర్వాత ఎనిమిదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ రోగి నమూనాల్ని సేకరిస్తారు. అప్పుడు పాజిటివ్ వస్తే.. మందుల డోస్ పెంచుతారు. పద్నాలుగో రోజు రెండోసారి నమూనాల్ని సేకరించి ల్యాబ్ కు పంపుతారు. ఆ తర్వాత మరోసారి పరీక్ష జరిపి.. వరుస నెగిటివ్ లు వస్తేనే రోగిని డిశ్చార్జి చేస్తారు. మొత్తంగా అందరికి ఒకేలా కాకుండా.. ప్రతి రోగిని ప్రత్యేకంగా.. వ్యక్తిగతంగా వారికుండే రోగనిరోధక శక్తిని అంచనా వేసి.. వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల ఆధారంగానే కరోనా చికిత్స ఉంటుందన్నది మర్చిపోకూడదు.