Begin typing your search above and press return to search.
లోగోల గోల
By: Tupaki Desk | 9 Oct 2015 8:29 AM GMTతెలుగు రాష్ట్రాల్లో లోగోల గోల మొదలైంది... దీనికి సంస్కృతి - సంప్రదాయాలు అంటూ భారీ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మొన్నటి గోదావరి పుష్కరాలను మహా పుష్కరాలుగా పేర్కొంటూ దానికోసం ఏకంగా పోటీ పెట్టి మరి ప్రత్యేక లోగో డిజైన్ చేయించారు. తాజాగా కొత్త రాజధాని అమరావతి కోసం కూడా లోగో డిజైన్ పోటీ నడుస్తోంది. అమరావతి చరిత్ర - తెలుగు చరిత్ర - సంస్కృతి - సంప్రదాయాలు - ఆచారాలు - వ్యవహారాలు అన్ని ప్రతిబింబించేలా లోగో ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచన ఆమేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా లోగోల బాట పట్టినట్లుగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న ఏపీ ఇప్పటికే లోగోల మీద లోగోలు తయారుచేస్తుంటే మనం మాత్రం తక్కువ తింటామా ఏంటి అనుకున్నారో ఏమో కానీ తెలంగాణ ప్రబుత్వం కూడా సమయం చూసి లోగో తయారు చేయించింది.
తెలంగాణ ప్రభుత్వం దసరాను పురస్కరించుకుని వారం రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన బతకమ్మ ఉత్సవాలకు గాను లోగోను కూడా తయారు చేసింది.
తెలంగాణ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తయారుచేసిన ఈ లోగో కు కూడా థీమ్ ఉంది. మహిళల సాధికారిత - పిల్లల సంరక్షణ - ప్రకృతి ఆరాదన - చెరువుల పరిరక్షణ ధీమ్ లతో దీనిని రూపొందించామని ఆయన తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని డిల్లీలో కూడా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ జీవన విదానానికి బతకమ్మ ప్రతీక కాబట్టి లోగో చేయించామని చెబుతున్నారు.