Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఆలోచనలూ టీడీపీలాగానే...

By:  Tupaki Desk   |   24 Sep 2015 10:30 PM GMT
టీఆర్ ఎస్ ఆలోచనలూ టీడీపీలాగానే...
X
రైతుల ఆత్మహత్యలపై తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ నాయకుల ఆలోచనలు కూడా గతంలో చంద్రబాబు తరహాలోనే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచిన తర్వాత నుంచి తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని, పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం పరిహారం పెంచడానికి ముందు, తర్వాత జరిగిన ఆత్మహత్యలను ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిన మాట వాస్తవమే. అది కూడా మూడు నాలుగు రోజులుగా రోజుకు పది మంది చొప్పున బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర ఆవేదనతో గుండెపోటుకు గురవుతున్నారు. వాస్తవానికి, ఇటువంటి మరణాలు గతంలో టీడీపీ హయాంలో కూడా జరిగాయి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ఆగ్రహానికి గురై అధికారాన్నే కోల్పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన ఇటీవల నవ్యాంధ్రలో రైతులకు ఇచ్చే పరిహారాన్ని లక్షన్నర నుంచి ఐదు లక్షలకు పెంచారు. అయినా, నవ్యాంధ్రలోని రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. నిజానికి పరిహారం ప్రకటించిన తర్వాత అక్కడ ఆత్మహత్యలు తగ్గాయి కూడా. ఇప్పుడు కూడా ఒకటీ అరా అక్కడక్కడా ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వాటిని నివారించడానికి ప్రభుత్వం, మంత్రులు రంగంలోకి దిగారు. గతానికి భిన్నంగా, ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

కానీ, రోజుకు పది మంది చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఇప్పటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి ఒక్క సానుభూతి మాట కరువైంది. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక్క చర్య కరువైంది. హరీశ్ రావు అప్పుడప్పుడూ ఆత్మహత్యలు వద్దని ప్రకటించడం మినహా మిగిలిన మంత్రులు.. విలేకరుల సమావేశాలుపెట్టి టీడీపీ, కాంగ్రెస్ లను విమర్శించడానికి పెద్దపీట వేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే రైతులకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు. రైతులకు భరోసా ఇవ్వ
​​
డానికి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, దీనిని ప్రభుత్వం పరిహారం ఆత్మహత్యలని దీనిని భావిస్తుండడమే విచారకరమని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.