Begin typing your search above and press return to search.

టీ అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల‌ని డిసైడ్ చేశారు

By:  Tupaki Desk   |   1 May 2017 4:52 AM GMT
టీ అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల‌ని డిసైడ్ చేశారు
X
నిజానికి అసెంబ్లీని ప్రోరోగ్ చేయ‌టం అన్న‌ది టెక్నిక‌ల్ అంశం మాత్ర‌మే. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల పుణ్య‌మా అని.. ఇప్పుడు ప్రోరోగ్ కూడా వార్త‌గా మారింది. ఒక ధ‌ఫా అసెంబ్లీ స‌మావేశాలు మొద‌ల‌య్యాక‌.. ఆ స‌మావేశాల్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ట్లుగా ఆదేశాలు జారీ చేయ‌టాన్ని ప్రోరోగ్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఏడో విడ‌త స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. బ‌డ్జెట్ స‌మావేశాలుగా పేర్కొన్న ఈ స‌మావేశాలు మార్చి 11న షురూ అయి 27 వ‌ర‌కూ సాగాయి. త‌ర్వాత స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. అయితే.. ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ముస్లిం.. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లుకు ఉద్దేశించిన రిజ‌ర్వేష‌న్ల బిల్లు ఆమోదానికి ఒక‌సారి.. తాజాగా భూసేక‌ర‌ణ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ కోసం ప్ర‌త్యేకంగా స‌భ‌ను హాజ‌రుప‌రిచారు.

తాజాగా ఏడో విడ‌త స‌మావేశాల‌కు ముగింపు ప‌లుకుతూ స‌భ‌ను ప్రోరోగ్ కానుంది. ఈసారి ఈ విష‌యాన్ని ఎందుకంత ప్ర‌త్యేకంగా పేర్కొంటున్నారంటే.. ఈ సెష‌న్ లో ఏదైనా పార్టీకి చెందిన స‌భ్యుడు (ఎమ్మెల్యే/ఎమ‌్మెల్సీ) స‌స్పెండ్ అయితే.. ఆ సెష‌న్ ప్రోరోగ్ అయ్యే వ‌ర‌కూ స‌భ‌కు హాజ‌రుకాకూడ‌దంటూ తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు వాదిస్తోంది.

దీనిపై ప‌లు రాజ‌కీయ పార్టీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. తాజా సెవెన్త్ సెష‌న్లో టీటీడీపీ.. బీజేపీ స‌భ్యులు స‌స్పెండ్ అయ్యారు. దీంతో.. బడ్జెట్ స‌మావేశాల అనంత‌రం ప్ర‌త్యేకంగా కొలువు తీరిన రెండు ప్ర‌త్యేక స‌మావేశాల‌కు స‌స్పెండ్ అయిన స‌భ్యుల్ని అనుమ‌తించ‌లేదు. దీనిపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తీరుపై ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. స‌స్పెండ్ అయిన స‌భ్యుడు.. ఆ స‌మావేశాలు పూర్తి అయ్యే వ‌ర‌కే త‌ప్పించి.. ఆ సెష‌న్ మొత్తం కాద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. దీనిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. తాజాగా సెవెన్త్ సెష‌న్ ను ప్రోరోగ్ చేయాల‌ని రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యించ‌టంతో.. త‌ర్వాత జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు ఇప్పుడు స‌స్పెండ్ అయిన స‌భ్యులంతా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి.

త్వ‌ర‌లో ప్రోరోగ్ చేయాల‌ని భావిస్తున్న స‌మావేశాల్ని తిరిగి వ‌ర్షాకాల స‌మావేశాల‌తో షురూ చేయాల‌ని భావిస్తున్నారు. ఈసారి నిర్వ‌హించే స‌మావేశాలు జులై లో కానీ త‌ర్వాత కానీ ఉండొచ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/