Begin typing your search above and press return to search.

శ్రీశైలం దుర్ఘటనపై వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   23 Aug 2020 5:00 PM GMT
శ్రీశైలం దుర్ఘటనపై వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్
X
అనూహ్యంగా చోటు చేసుకున్న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ సీరియస్ గా ఉంది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. దీనికి నిర్లక్ష్యంతో పాటు.. ఉన్నతాధికారుల అలక్ష్యం కూడా కారణమన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మితిమీరిన రీతిలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఓవర్ లోడ్ తోనే ఈ ఘటన చోటు చేసుకుందంటున్నారు.

ఈ దుర్ఘటన చోటు చేసుకున్న కొద్ది గంటల్లోనే.. కేసీఆర్ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించింది. అదనపు డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని ఓ బృందం విచారణను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. తాజాగా కేసీఆర్ సర్కారు ఈ ఉదంతంపై మరో నిర్ణయాన్ని తీసుకుంది. సీఐడీ కమిటీకి అదనంగా మరో కమిటీని ఏర్పాటు చేసింది.

ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీ ప్రమాదంపై పదిహేను రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో జేఎండీ శ్రీనివాసరావు.. ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి.. టీఎస్ జెన్ కో ప్రాజెక్టుడైరెక్టర్ సచ్చిదానందం.. కన్వీనర్ రత్నాకర్ సభ్యులుగా ఉండనున్నారు. సీఐడీ దర్యాప్తునకు.. ఈ కమిటీ తేల్చే అంశాలు ఎలా ఉంటాయో చూడాలి.