Begin typing your search above and press return to search.
రుణమాఫీకి సిద్ధమవుతున్న టీఆర్ ఎస్ సర్కారు
By: Tupaki Desk | 23 Dec 2018 7:00 AM GMTటీఆర్ ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సిద్ధమవుతుంది. టీఆర్ ఎస్ గెలిచేందుకు ముఖ్యపాత్ర పోషించింది అన్నదాతలే. ఆ అన్నదాతకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీకి ఇప్పడు సిద్ధమవుతుంది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టన తర్వాత రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. 2014లో ప్రభుత్వం 35.29 లక్షల మంది రైతులకు రూ. లక్ష మాఫీ చేయగా, ఈసారి వారి సంఖ్య 40 లక్షలకు చేరవచ్చని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పుడు రూ.16,124 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈసారి రుణమాఫీకి 20వేల కోట్లపైనే ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు.
2014 నుంచి ప్రభుత్వం రుణమాఫీని నాలుగు విడుతలుగా అంటే 2017 మార్చి వరకు విడుదల చేసింది. ఈసారి 2017-18 ఖరీఫ్ - రబీ - 2018-19 ఖరీఫ్ - రబీ పంట రుణాలు తీసుకున్న రైతులను పరిగణలోకి తీసుకోవాలని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో రబీని పరిగణలోకి తీసుకోకపోవచ్చని చర్చ జరుగుతుంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు సీజన్లలో రైతులు తీసుకున్న రుణాల్లో లక్ష రూపాయలు మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.
2017-18 ఖరీఫ్ - రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఖరీఫ్ లో 26.20లక్షల మంది రబీలో 12.90 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వీరికి బ్యాంకులు మొత్తంగా రూ.23,488 కోట్లు రుణాలు ఇచ్చాయి. ఈ ఖరీఫ్ లోనే 22.21 లక్షల మంది రైతులు రూ.19,671 కోట్లు - ప్రస్తుత రబీలో ఇప్పటి వరకు 4.24లక్షల మంది రైతులు రూ.3,816 కోట్లు రుణాలు తీసుకున్నారు.
రైతులు రబీకి సంబంధించి అక్టోబర్ - నవంబర్ - డిసెంబరులో పంట రుణాలు తిరిగి బ్యాంకులకు చెల్లించి కొత్త రుణాలు తీసుకుంటారు. కాగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో ప్రధానంగా రుణమాఫీ ప్రకటించడంతో రైతులు రీషెడ్యూల్ చేసుకోవడం ముందుకు రావడం లేదు. ఎలాగూ రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో వారు ఉన్నారు. కాగా ఈసారి రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.