Begin typing your search above and press return to search.
సమంత బ్రాండ్ అంబాసిడర్ కాదంటున్నారు
By: Tupaki Desk | 19 April 2017 5:53 AM GMTమాటలు వేరు చేతలు వేరు అని చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు..కమ్ రాష్ట్ర మంత్రి.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ ఇన్ ద తెలంగాణ అంటూ పలు రకాలుగా అభివర్ణించే కేటీఆర్ కు సంబంధించిన ఆసక్తికర ఉదంతం ఇది. ఆయన నోటి నుంచి వచ్చే మాట అంటే దాదాపు అధికారికంగా అని అనుకుంటాం. అందునా.. మీడియాతో తనకు తానే ప్రస్తావించినప్పుడు ఆ నిర్ణయం అధికారికం అనుకుంటామే కానీ.. ఏదో మాట వరసకు అన్నట్లుగా అనుకోం. కానీ.. అలా అనుకోవాల్సిందేనన్న విషయం తాజాగా వెల్లడైంది.
తెలంగాణ రాష్ట్ర సర్కారు కొలువు తీరిన రెండున్నరేళ్ల తర్వాత ఉన్నట్లుండి.. కేటీఆర్ కు చేనేత విపరీతమైన ప్రేమాభిమానాలు పొంగిపొర్లాయి. చేనేతల బతుకుల్ని మార్చేందుకు వీలుగా ఆయన నడుం బిగించారు. చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేయాలన్న మాటల్ని చెప్పటంతో పాటు.. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీనటి సమంతను నియమించినట్లుగా చెప్పేశారు.
అంతేనా.. వారంలో ఒక్కరోజు అయినా చేనేత వస్త్రాలు ధరించాలన్న నియమాన్ని ఆయన చెప్పారు. ఇలాంటి మాటలతో పాటు.. చేనేతను ప్రమోట్ చేసే వారిని ప్రశంసించటం.. చేనేత వస్త్రాల అమ్మకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టటంతో పాటు.. చేనేత రంగాన్ని ఆదుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో తరచూ మాట్లాడటం లాంటివి చేస్తున్నారు.
ఇన్ని చేస్తున్న ఆయన.. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సినీనటి సమంతను ఎంపిక చేయటం అధికారికం కాదన్న విషయం తాజాగా వెల్లడైంది. సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని తెలంగాణ రాష్ట్ర సర్కారు అధికారికంగా వెల్లడించటం విశేషం. చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు చేనేత.. జౌళి అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ.. సమంతను తెలంగాణ చేనేత రాయబారిగా నియమించలేదని తేల్చేశారు.
మరి.. మంత్రి చెప్పే మాటలు అధికారికం కావా? అన్న డౌట్ ఒకటైతే.. రాయబారిగా కేటీఆర్ చెప్పిన నాటి నుంచి.. తనవంతు కర్తవ్యంగా చేనేత సంఘాల్ని ప్రమోట్ చేసేలా సమంత చేస్తున్న పని అంతా ఏమైనట్లు? కోటి రూపాయిల ప్రోత్సాహకంతో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి టెన్నిస్ స్టార్ సానియామీర్జా తెలంగాణ రాష్ట్ర ప్రమోషన్ కోసం ఏం చేశారో ఎవరికి తెలియని పరిస్థితి. తనను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారన్న మాటతో.. చేనేతకు ఆదరణ లభించేలా చేస్తున్న సమంతను అధికారికంగా అవమానించినట్లు కాదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. కేటీఆర్ చెప్పే మాటల్ని విన్న తర్వాత.. సార్.. మీరు చెప్పేది అధికారికమా? అనధికారికమా? అని మీడియా మిత్రులు అడిగితే బాగుంటుందేమో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/