Begin typing your search above and press return to search.

తెలంగాణలో 3వేల స్కూళ్లు బంద్.. కారణమిదే..

By:  Tupaki Desk   |   22 Oct 2019 10:20 AM GMT
తెలంగాణలో 3వేల స్కూళ్లు బంద్.. కారణమిదే..
X
తెలంగాణలో స్కూళ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలు మరీ తీసికట్టుగా మారుతున్నాయి. ప్రైమరీ స్కూళ్లలో పిల్లలు శరవేగంగా తగ్గిపోతున్నారు. దగ్గరలోని హైస్కూళ్లలో వీరిని విలీనం చేస్తోంది.

ఇప్పటికే పిల్లలు లేని కారణంగా ప్రభుత్వం రేషనలైజేషన్ చేసి దాదాపు 3500 స్కూళ్లను మూసివేయాలనుకుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘం టీటీఎఫ్ ఆరోపించింది.

దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులు దీని వల్ల మధ్యలోనే స్కూల్ మానేసే ప్రమాదం ఉందని టీటీఎఫ్ ఆరోపించింది.

ఇప్పటికే అనేకచోట్ల ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తే 5వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు రావడమే మానేస్తున్నారని తెలిసింది. గతంలో ఏపీ సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇప్పుడు తెలంగాణ కూడా ఇదే పని చేస్తుండడంతో దాదాపు 3వేల స్కూళ్లు మూతపడుతున్నాయి. ఇక టీచర్ల రిక్రూట్ మెంటే తెలంగాణలో లేకుండా పోయే ప్రమాదం నెలకొంది.