Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారు వారి మరో బంపర్ ఆఫర్
By: Tupaki Desk | 25 May 2016 4:35 AM GMTప్రజల మనసుల్ని దోచుకోవటానికి సంక్షేమ పథకాల్ని పాలకులు ప్రకటించటం మామూలే. అయితే.. అవసరం లేని అంశాల విషయంలోనూ ఇలాంటి తీరు ప్రదర్శించటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. తాజాగా తెలంగాణ సర్కారు ఒక జీవో జారీ చేసింది. దీని ప్రకారం ఏడాదికి రూ.2లక్షల లోపు (నెలకు రూ.16 వేలకు కాస్త అటూఇటూగా) ఆదాయం ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజా ఆదేశాలతో ఇప్పటివరకూ ఉన్న కనెక్షన్లు భారీగా పెరుగుతాయని.. ప్రభుత్వం మీద ఎలాంటి భారం ఉండదని ప్రకటించటం గమనార్హం.
నిజానికి నల్లా కనెక్షన్ కోసం లక్షలాది మంది ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎక్కడి వరకో అక్కర్లేదు.. హైదరాబాద్ శివారులో నల్లా సౌకర్యం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారు లక్షలాది మంది ఉన్నారు. నిబంధనలకు తగినట్లుగా కట్టటానికి కూడా ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. వాస్తవానికి.. నల్లా లైన్ లేని ప్రాంతాల్లో.. లైను వేయటానికి అయ్యే ఖర్చులో సగ భాగం పెట్టుకోవటానికి శివారు ప్రాంతాల్లోని ప్రజలు సిద్ధంగా ఉన్న పరిస్థితి.
అలాంటి వాటిని పట్టించుకోని ప్రభుత్వం.. నల్లాను రూపాయికే అందిస్తామంటూ డాబుసరి ప్రకటనలు జారీ చేయటం అర్థం లేనిది. ఓపక్క ఏ సేవ కోసం ఎంతకైనా రెఢీ అనే వారు ఓపక్కన ఉంటే వారి విషయాన్ని పట్టించుకోని సర్కారు.. మరోవైపు తక్కువ ఆదాయం ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్ అంటూ ఊరింపు జీవోలు చేయటం ఏమిటోపాలకులే అర్థం కావాలి.
నిజానికి తక్కువ ఆదాయ వర్గాల వారిని ఆదుకోవాలన్న తపన ప్రభుత్వానికి నిజంగా ఉంటే.. వారి ఆలోచన భిన్నంగా ఉండాలి. నల్లా కనెక్షన్ కోసం ఖర్చుకు వెనకాడని వారు కోరుకున్నట్లు నల్లా కనెక్షన్ ఇవ్వటంపై దృష్టి సారించాలి. అలా వారికిచ్చే నల్లా కనెక్షన్లతో వచ్చే ఆదాయంతో.. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఉచితంగా నల్లా కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. రూపాయికి సరైన వేరుశెనగ చక్కీ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా నల్లా కనెక్షన్ ఇచ్చే కన్నా.. ఫ్రీగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా..?