Begin typing your search above and press return to search.
తెలంగాణ సర్కారు పీనాసితనం
By: Tupaki Desk | 9 Jan 2016 9:27 AM GMTమిగులు బడ్జెట్ ఉన్న రాష్ర్టాల్లో రెండో స్థానంలో ఉన్నామని పదేపదే చెప్పే తెలంగాణ రాష్ర్టం ఇపుడు పొదుపు చర్యలను పాటిస్తోంది. అయితే పొదుపు కాస్త అతిగా మారడం అసలు ట్విస్ట్. తెలంగాణ ప్రభుత్వం తమ సర్కారీ ఆఫీసుల్లో కరెంట్ దుబారాను తగ్గిచేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా విశ్లేషణ చేస్తే చాలా వరకు ఆఫీసుల్లో కరెంట్ ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారని సర్కారు తేలింది. సర్కారీ ఆఫీసులు ఇష్టారాజ్యంగా కరెంట్ వాడేసి బిల్లులు కట్టడం లేదని దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయని గమనించారు. ఇలా 2015 డిసెంబర్ 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వశాఖలు - స్థానిక సంస్థలు దాదాపు 19వందల 23 కోట్ల రూపాయలు డిస్కంలకు బకాయిపడ్డాయి. నోటీసులు ఇచ్చినా ఆయా శాఖల నుంచి స్పందన రాకపోవడంతో ఖజానాకు భారీగా గండిపడుతోంది. దీంతో ఈ కొత్త ప్లాన్ చేసింది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆఫీసులో లైట్లు - ఫ్యాన్లు - ఏసీలు - కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయో చూసి.. వాటికి ఎంత కరెంట్ అవసరమవుతుందో లెక్కించి కరెంట్ కేటాయిస్తారు. దీని ప్రకారం ప్రీపెయిడ్ మీటర్ లు బిగిస్తారు. ఆ కోటా నుంచే విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. కోటా దాటితే కరెంట్ కట్ అయిపోతుంది. అదనంగా వాడుకోవాలంటే వెంటనే డబ్బులు కట్టాలి.
ఇంతకీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం ఎప్పటినుంచి అమలులోకి వస్తుందో చెప్పలేదు కదా? ఈ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. అప్పటికీ ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సో... ఇకనుంచి ప్రభుత్వ ఆఫీసే కదా అని లైట్లు - ఫ్యాన్లు - ఏసీలు - కంప్యూటర్లు ఇష్టం ఉన్నట్లు వాడేందుకు వీలు లేదన్నమాట. ప్రీపెయిడ్ మీటర్ లు బిగిస్తారు కాబట్టి కేటాయించిన కోటా నుంచే విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. కోటా దాటితే కరెంట్ కట్ అయిపోతుంది. అదనంగా వాడుకోవాలంటే వెంటనే డబ్బులు కట్టాలి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు బహుపరాక్ గా ఉండాలి.