Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌ మ‌ధ్య కొత్త బంధం

By:  Tupaki Desk   |   16 Oct 2016 9:55 AM GMT
తెలుగు రాష్ట్రాల‌ మ‌ధ్య కొత్త బంధం
X
స‌మ‌యం - సంద‌ర్భం వ‌స్తే పాల‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త కుదురుతుంద‌నేందుకు ఏపీ - తెలంగాణ‌లే నిద‌ర్శ‌నం. రాష్ట్ర విభ‌జ‌న వ‌ర‌కు నేత‌ల మ‌ధ్య‌ ఉన్న గ్యాప్ ఓటుకు నోటు కేసుతో తారాస్థాయికి చేరింది. అనంత‌రం ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ప‌రిపాల‌న‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంతో ఖాళీ అయిన ప్ర‌భుత్వ బంగ్లాల‌ను ఇరు రాష్ట్రాల‌కు మేలు చేకూర్చేలా ఉప‌యోగించుకోనున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న‌ హైదరాబాద్‌ లో ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన భవనాలను తెలంగాణ స‌ర్కారుకు అద్దెకిచ్చి వాటి ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌డం - తెలంగాణ అంగీక‌రించ‌డం పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ లో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల భవనాలపై హక్కులు తమవేనంటూ తెలంగాణ ప్రభుత్వం వాదించింది. అయితే తెలంగాణ వాద‌న స‌రికాద‌ని రెండు రాష్ట్రాలకు భవనాలు-ఆస్తులపై జనాభా నిష్పత్తి మేరకు హక్కులు ఉంటాయని ఉన్నత న్యాయస్థానాలు వ‌ర‌కు వెళ్లి ఏపీ వాదించ‌డం ద్వారా త‌న వాటాను ద‌క్కించుకుంది. దీంతో తెలంగాణ వెనకడుగు వేసింది. తాజాగా ఏపీ ప‌రిపాల‌న మొత్తం అమ‌రావ‌తి నుంచే సాగుతున్న నేప‌థ్యంలో ఒక‌వైపు, తెలంగాణ‌కు భ‌వ‌నాల కొర‌త మ‌రోవైపు ఉన్న నేప‌థ్యంలో ఉమ్మ‌డిగా ఒక ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చారు. తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం వరకు ఏపీ ఆధీనంలోని భవనాలను అద్దెకు తీసుకునేందుకు అంగీక‌రించ‌డం ఈ అంగీకారం సారాంశం. త్వ‌ర‌లో ఈమేర‌కు కొన్ని భ‌వ‌నాల‌ను ఇలా బాడుగ‌కు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/