Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలల జెండా సగర్వంగా ఎగిరింది

By:  Tupaki Desk   |   2 Jun 2016 8:25 AM GMT
కేసీఆర్ కలల జెండా సగర్వంగా ఎగిరింది
X
కలలు కనే వాళ్లు కోట్లాది మంది ఉంటారు. కానీ.. తమ కలల్ని సాకారం చేసేందుకు కొందరు మాత్రం విపరీతంగా శ్రమిస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో ముందుండే అధినేతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పాలి. ఎందుకంటే ఆయన కలలన్నీ అషామాషీగా ఉండవు. భారీగా ఉంటాయి. కష్టసాధ్యంతో కూడుకున్నవై ఉంటాయి. స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేయాల్సినవిగా ఉంటాయి. అందుకే ఇబ్బంది అంతా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజున అందరికి గుర్తుండిపోయేలా.. దేశం మొత్తం చూపు తన మీద పడేలా ఆయన భారీ ఆలోచన చేశారు. అతి ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఆలోచన తళుక్కున మెరిసింది.

అంతే.. యుద్ధ ప్రాతిపదికన ఆ పనుల్ని పూర్తి చేయాలని పురమాయించారు. ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించి.. అనుకున్న సమయానికి.. తాను అనుకున్నట్లుగానే అతి ఎత్తైన జెండాను ఎగురవేసి.. తన కలను తీర్చుకున్నారు. 108 అడుగుల వెడల్పు.. 72 అడుగుల ఎత్తుతో 300 అడుగుల ఎత్తైన జెండా స్తంభం మీద సగర్వంగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు.. కేసీఆర్ మీద అభిమానం మరింత పెరగటం ఖాయం. ఇలాంటి భారీ ఆలోచనల్ని ఆయన మాత్రమే చేయగలరేమో..?