Begin typing your search above and press return to search.

టీ పుణ్యం: ఖరీదు కానున్న ఆన్ లైన్ కొనుగోళ్లు

By:  Tupaki Desk   |   1 Oct 2015 10:03 AM IST
టీ పుణ్యం: ఖరీదు కానున్న ఆన్ లైన్ కొనుగోళ్లు
X
పేరుకు ధనిక రాష్ట్రమే అయినా పుట్టెడు సమస్యలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సర్కారు అదనపు ఆదాయం వచ్చే మార్గాల కోసం విపరీతంగా ప్రయత్నిస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటానికి సిద్ధంగా లేదు.

వీలైనంతగా ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ సర్కారు.. అందుకు తగ్గట్లే కొత్త కొత్త మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాల్ని అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆన్ లైన్ వ్యాపారాల మీద దృష్టి సారించింది. ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన ఆన్ లైన్ కార్యకలాపాల నేపథ్యంలో.. కొనుగోళ్లు.. అమ్మకాలకు సంబంధించి ఆన్ లైన్ కు వ్యాట్ లేకపోవటంతో.. ఆ అమ్మకాల్ని పన్ను పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.

పెద్ద ఎత్తున ఆపర్లు.. డిస్కౌంట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆన్ లైన్ అమ్మకాల్ని వ్యాట్ పరిధిలోకి తీసుకొచ్చే పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ అమ్మకాలపై వ్యాట్ విధించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తోంది. త్వరలోనే ఆన్ లైన్ అమ్మకాలపై వ్యాట్ విధించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు సాగితే.. పలు ఉత్పత్తులపై 14 శాతం వరకూ వ్యాట్ భారం పడినట్లే. అంటే.. ప్రతి వంద రూపాయిల కొనుగోలుకు రూ.14 రూపాయిల భారం అదనం కానుంది. అంటే.. మరో కొత్త భారం షురూ కానుందన్న మాట.