Begin typing your search above and press return to search.

హోమియోపతితో బ్లాక్ ఫంగస్ కి చెక్ పెట్టాలనుకుంటున్న తెలంగాణ సర్కార్ !

By:  Tupaki Desk   |   21 May 2021 3:30 PM GMT
హోమియోపతితో బ్లాక్ ఫంగస్ కి చెక్ పెట్టాలనుకుంటున్న తెలంగాణ సర్కార్ !
X
కంటికి కనిపించని కరోనా నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ మరింత ఆందోళనకి గురిచేస్తుంది. ఈ తరహా కేసులు తెలంగాణలో భారీగా పెరుగుతున్నాయి. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడానికి ఉద్దేశించిన యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తోన్న బ్లాక్ ఫంగస్ కేసులకు అనుగుణంగా కేంద్రం నుంచి ఈ ఇంజెక్షన్లు రావాట్లేదనే అసంతృప్తి కూడా తెలంగాణ ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. దీనిపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ కేంద్రం పై అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. దానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే .. ఈ పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్ బారిన పడికి అవసరమైన చికిత్స కోసం హోమియోపతిని ఆశ్రయించింది కేసీఆర్ సర్కార్.

హోమియోపతి మెడిసిన్‌ ద్వారా బ్లాక్ ఫంగస్‌ కు అడ్డకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ ఫంగల్ ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడుతోన్న వారికి అందజేసే ట్రీట్‌ మెంట్‌ లో హోమియోపతిని కూడా చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసింది. హోమియోపతిలో వినియోగించే ఆర్సెనిక్-ఏఎల్‌బీ 200 మెడిసిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిని ఎలా వినియోగించాలనే విషయంపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వాలిఫైడ్ హోమియోపతిక్ ఫిజీషియన్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని సూచించింది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ముకోర్‌మైకోసిస్ లక్షణాలతో బాధపడుతున్న వారు ఆర్సెనిక్-ఏఎల్‌ బీ 200 పిల్స్‌ ను రోజూ రెండు పూటల చొప్పున వాడాలని సూచించింది. ఒక్కో పూటలో ఆరు పిల్స్ మింగాల్సి ఉంటుందని, ఇలా అయిదు రోజులు చేయాలని పేర్కొంది. దీనితోపాటు- ఫైవ్. పీహెచ్ ఓ ఎస్ 6 ఎక్స్ టాబ్లెట్లను కూడా వినియోగించవచ్చని సూచించింది. రోజూ రెండు పూటలా మూడు ట్యాబెట్ల చొప్పునవాటిని తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా 30 రోజుల పాటు కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. రైనొసెరెబ్రిల్ ముకోర్‌మైకోసిస్, పల్మనరీ ముకోర్‌మైకోసిస్, క్యుటానియస్ ముకోర్‌మైకోసిస్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ముకోర్‌మైకోసిస్ కోసం ప్రత్యేకంగా హోమియోపతి మెడిసిన్‌ ను వాడుకోవచ్చని తెలిపింది.