Begin typing your search above and press return to search.
గ్రూప్ 2కి, జీహెచ్ ఎంసీకీ లింకేంటి?
By: Tupaki Desk | 31 Dec 2015 10:31 AM GMTనిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్ వెలువడింది. ఏకంగా 436 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ బుధవారం వెలువడింది. అంతేనా.. మరో పది వేల పోస్టులు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందంటూ ప్రభుత్వం సంకేతాలు కూడా ఇస్తోంది. అయితే, కేవలం కమలనాథన్ నివేదిక ఇచ్చిన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇస్తామని, సాధారణ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఉరుము లేని పిడుగులా ఇప్పుడే ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది? ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది.
అయితే, కేసీఆర్ ప్రభుత్వంపై విద్యార్థులు మరీ ముఖ్యంగా నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో వారంతా ఆందోళన బాటలో ఉన్నారు కూడా. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యానికి ఎంతో కొంత గండి కొట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే ఈ నెల రోజులూ విద్యార్థులు కనక రోడ్డెక్కితే తమకు నష్టమేనని భావించింది.
నెల రోజులపాటు విద్యార్థులను ఎక్కడా ఖాళీ లేనంత బిజీగా ఉంచాలి. ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది. అదే గ్రూప్స్ నోటిఫికేషన్. గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తే విద్యార్థులు, నిరుద్యోగులు దానికి దరఖాస్తు చేసుకోవడం.. ప్రిపేర్ కావడం.. కోచింగ్ సెంటర్లు, చదువుకోవడం వంటి హడావుడిలో నిమగ్నమవుతారు. ఎన్నికలు, ప్రచారం వంటి వాటికి దూరంగా ఉంటారు. తద్వారా హైదరాబాద్ లో కొంత వ్యతిరేకతను చాలా సులభంగా తప్పించుకోవచ్చు. ప్రభుత్వ వ్యూహం ఇదేనని, నిరుద్యోగులు, విద్యార్థుల వ్యతిరేకత నుంచి బయటపడడానికే నోటిఫికేషన్ ను ఇప్పుడు ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ 2కి ఐదు లక్షల మంది దరఖాస్తు చేస్తారని, అంచనా. వీరి వ్యతిరేకత పోయినట్లే కదా. వీరు అనుకూలంగా మారినట్లే కదా.