Begin typing your search above and press return to search.

ప‌ద్మ పుర‌స్కారాల్లో తెలంగాణ‌కు అన్యాయం?

By:  Tupaki Desk   |   26 Jan 2018 5:14 AM GMT
ప‌ద్మ పుర‌స్కారాల్లో తెలంగాణ‌కు అన్యాయం?
X
కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌పై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. ప‌ద్మ పుర‌స్కారాలు పొందిన వారి విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రం లేకున్నా.. తెలంగాణ రాష్ట్రం త‌ర‌ఫున ఒక్క‌రికి కూడా పుర‌స్కారం ల‌భించ‌క‌పోవ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నేప‌థ్యంలో ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురి ప్ర‌ముఖుల్ని సిఫార్సు చేసినా.. కేంద్రం మాత్రం ఏపీకి చెందిన ఒక్క‌రి పేరును మాత్ర‌మే ప్ర‌క‌టించ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలంగాణ‌కు చెందిన ఏ ఒక్క‌రూ ప‌ద్మ పుర‌స్కార జాబితాలో లేక‌పోవ‌టంపై ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప‌ద్మ పుర‌స్కారాల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ప‌లువురు ప్ర‌ముఖుల పేర్ల‌ను సిఫార్సు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఒక్క‌రి పేరును కూడా కేంద్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

దేశ అత్యుత్త‌మ పుర‌స్కార‌మైన భార‌త‌ర‌త్న కోసం మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు పేరును.. తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ పేరును ప‌ద్మ‌విభూష‌ణ్‌ కు పంపిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం కోసం తెలంగాణ నుంచి నామినేట్ అయిన వారిలో ఆర్థిక‌వేత్త చెన్న‌మ‌నేని హ‌నుమంత‌రావు.. న‌వ‌లా ర‌చ‌యిత ప్రొఫెస‌ర్ శివ్ కె. కుమార్ కూడా ఉన్నారు. ప‌ద్మ‌భూష‌ణ్‌ కు బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధూ పేరును సిఫార్పు చేశారు.

ఇక‌.. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల కోసం ప్ర‌జా గాయ‌కుడు గోరేటి వెంక‌న్న‌.. అందెశ్రీ‌. విద్యావేత్త చుక్కా రామ‌య్య‌.. సినీ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌ల పేర్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం పంపిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. వీరిలో ఏ ఒక్క‌రిని కేంద్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవటం.పై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

అదే స‌మ‌యంలో ఏపీ నుంచి 25 పేర్ల‌ను ప‌ద్మ పుర‌స్కారానికి సిఫార్సు చేస్తే.. ఒక్క పేరును మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టంపై ఏపీ ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా ప‌ద్మ పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల వారిని అసంతృప్తికి గురి చేసింద‌న‌టంలో సందేహం లేదు.