Begin typing your search above and press return to search.
తెలంగాణ లాక్ డౌన్ : క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్ !
By: Tupaki Desk | 29 April 2021 4:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారి జోరు చూపిస్తుంది. అదే జోరు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ లో లాక్ డౌన్ వేయబోతున్నారు అంటూ సోషల్ మీడియా ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే , తెలంగాణ లో కరోనా పరిస్థితి , లాక్ డౌన్ పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ పై వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదు అని , అది తప్పుడు ప్రచారం అని క్లారిటీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేవీ ఇవ్వలేదని... ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ కేసుల పెరుగుదలలో స్థిరత్వం వచ్చిందన్నారు. అయితే , రాబోయే 3,4 వారాలు చాలా కీలకమని.. జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. వందేళ్లకోసారి ఇలాంటి విపత్తులు వస్తాయని, రాష్ట్రంలో 90 శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ వస్తుంది కాబట్టి ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ...రాష్ట్రంలో ఇప్పటివరకు 45 లక్షల మంది పైగా వాక్సిన్ తీసుకున్నారని, దశలవారీగా మిగతావారికి కూడా వాక్సిన్ వేయిస్తామని, కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సింటమ్స్ ఉంటేనే కోవిడ్ ఉన్నట్టని, భయంతో పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరొద్దని కోరారు. లక్షణాలు ఉన్నవారు భయంతో పరీక్షలకు రావడం లేదని.. కానీ కోవిడ్ లేని వారు పరీక్షల కోసం వచ్చి వ్యాధి తెచ్చుకుంటున్నారని అయన వ్యాఖ్యానించారు. 80 శాతం మందికి హాస్పిటల్స్ అవసరం లేదని.. చాలా వరకు ఇంట్లో డాక్టర్ల సలహాలతో కోలుకోవచ్చని డైరెక్టర్ శ్రీనివాసరావు గుర్తుచేశారు.