Begin typing your search above and press return to search.

షాకింగ్.. ఈటెల ఓఎస్డీకి పాజిటివ్.. ఇప్పుడేమవుతుంది?

By:  Tupaki Desk   |   15 Jun 2020 5:15 AM GMT
షాకింగ్.. ఈటెల ఓఎస్డీకి పాజిటివ్.. ఇప్పుడేమవుతుంది?
X
ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేకుండా కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటూ.. తనకు దగ్గరగా వచ్చిన వారెవరైనా.. ఎంత పవర్ ఫుల్ అయినా వారిలోకి ఎక్కేసే గుణం మహమ్మారికి ఉన్న అలవాటన్నది తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులకు దీని బారిన పడినప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటివరకూ అలాంటి పరిస్థితి లేదు.లాక్ డౌన్ సడలింపులతో ఈ ముప్పు కొత్త తరహాలో షురూ అయి.. కొత్త షాకుల్ని ఇస్తోంది.

మొన్నామధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు.. తాజాగా మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి లాంటి వారికి సోకింది. ఇక హైదరాబాద్ మహనగరానికి మేయర్ గా వ్యవహరిస్తున్న బొంతు రామ్మోహన్ సహాయకుడితో పాటు.. ఆయన డ్రైవర్ కుపాజిటివ్ రావటం తెలిసిందే. దీంతో.. జీహెచ్ఎంసీ పేషీలో కొత్త కలకలం చోటు చేసుకుంది.

ఇది సరిపోదన్నట్లుగా తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి.. మాయదారిరోగంపై అలుపెరగని పోరాటం చేయటంతోపాటు.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ కు దిమ్మ తిరిగేలా షాక్ తగిలిన పరిస్థితి. ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓఎస్డీ గంగాధర్ కు తాజాగా పాజిటివ్ గా తేలింది.

ఈ వార్తతో వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు కొత్త కలవరాన్ని పుట్టించింది. ఓఎస్డీకి పాజిటివ్ అయిన నేపథ్యంలో ఈటెల సైతం వెంటనే టెస్టు చేయించుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుండగానే.. తెలంగాణ అధికారపక్షానికి చాలా దగ్గరగా వైరస్ వచ్చేసిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.