Begin typing your search above and press return to search.
ఇన్ని పనులు చేయాలని హైకోర్టు చేత చెప్పించుకోవాలా కేసీఆర్?
By: Tupaki Desk | 6 May 2021 3:33 AM GMTఆలోచనకు కూడా రాని అంశం ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారింది. విపత్తు విరుచుకుపడినప్పుడు.. పాలనా వ్యవస్థ ఏం చేయాలన్న విషయాన్ని మరెవరో చెప్పే వరకు చేష్టలుడిగిపోయినట్లు ఉండటమా?. అది కేంద్రం కానీ.. రాష్ట్రం కానీ. అసలు వారున్నదే ప్రజల్ని పాలించటానికి. వారి క్షేమం.. సంక్షేమాన్ని చూసుకోవటానికే కదా? అలాంటప్పుడు పాలనా పగ్గాలు మొత్తంగా తమ చేతుల్లో ఉంచుకొని.. వాటి చేత ఎలా పని చేయించాలన్న విషయాన్ని కోర్టు చెప్పే వరకు ఉండటం దేనికి నిదర్శనం?
నిత్యం రాజకీయాలు.. రాజకీయ ఎత్తులు.. ప్రత్యర్థుల పీచమణచటం ఎలా అన్న అంశం తప్పించి.. పాలనా.. సంక్షేమం.. ప్రజలేం అవుతున్నారు? వారికేం కావాలి? వారికి ఎలాంటి నొప్పి కలగకుండా.. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ముందస్తుగా ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వాలు పట్టనట్లుగా ఉండటమా? అసలు ఇలాంటివి ఊహించగలమా? తాజాగా కరోనా అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయంపై హైకోర్టులో విచారణ జరగింది.
ఈ సందర్భంగా కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు.. ఇచ్చిన సలహాలు.. చేయాలని కోరిన సూచనలు చూస్తే.. పాలనా వ్యవస్థ ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమేం చేయాలన్న దానిపై పెద్ద చిట్టానే హైకోర్టు ఇవ్వటం గమనార్హం. ఇంతకీ.. ప్రభుత్వం ఏం చేయాలో హైకోర్టు చెప్పింది చూస్తే..
- వారాంతపు లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపు పరిశీలించండి
- రోజుకు లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోండి
- ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స.. మందుల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలి
- ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే చికిత్సలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలి
- జీహెచ్ఎంసీలో మాదిరి మిగిలిన అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నెంబర్లను వారంలో ఏర్పాటు చేయాలి
- ఖైదీలు.. నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారు?
- రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ వేయాలి
- వారి సమావేశ వివరాల్ని సమర్పించాలి.
- శుభకార్యాల్లో 200 మంది.. అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు
- వివాహ.. అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి
- ఆసుపత్రుల వద్ద పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- మాస్కులు ధరించని వాహనాల జప్తు అంశాన్ని పరిశీలించాలి
- పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించటంపై రాష్ట్రం ఫోకస్ పెట్టాలి
- ఫంక్షన్ హాళ్లు.. పార్కులు.. మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి
- ఆర్టీపీసీఆర్ ఫలితం 24 గంటల్లో వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఏపీ నుంచి వచ్చే రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.