Begin typing your search above and press return to search.
కరోనాను గాలికొదిలేశారా? కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు
By: Tupaki Desk | 17 Jun 2020 2:28 PM GMTమొదట్లో హడావుడి చేసిన కేసీఆర్.. రోజు విడిచి రోజూ.. రెండు రోజులకు ఒకసారి కరోనాపై ప్రెస్ మీట్లు పెడుతుంటే జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. కేసీఆర్ కరోనా జాగ్రత్తల గురించి చెబుతుంటే నిక్కబొడుచుకొని వినేవారు. చికెన్ తో కరోనా సోకదని.. అతి తింటేనే తగ్గుతుందని కేసీఆర్ చెబితే అందరూ చికెన్ కోసం ఎగబడ్డ తీరు చూశాం.. రేపటికి, ఎల్లుండికి .. ఫలానా డేట్ కు తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రం అవుతుందని కేసీఆర్ ఊహలు చెబుతుంటే వినసొంపుగా విన్నాం.. కానీ ఏమైందీ.. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీటే బంద్ అయిపోయింది. తెలంగాణలో కరోనా కంట్రోల్ తప్పింది.. విచ్చలవిడిగా సోకుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా పాకింది. దీంతో కేసీఆర్ సర్కార్ కరోనాను కంట్రోల్ చేయడం మానేసిందని.. చేతులెత్తేసిందన్న ప్రచారం ఎక్కువైంది.
తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఇదే మాట అంది. తాజాగా బుధవారం తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ సర్కార్ నిస్సహాయత, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి.
తాజాగా హైకోర్టు ‘కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత తెలంగాణ ప్రభుత్వంలో కనిపించట్లేదని.. వైరస్ నియంత్రణపై సర్కార్ కు ఆసక్తి ఉత్సాహం పోయిందని’ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ధోరణి చూస్తుంటే ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్నట్టు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. పరీక్షలు తక్కువ చేస్తే తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.
తమ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని.. గాంధీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం పరిస్థితికి అద్దం పడుతోందని హైకోర్టు టీ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.