Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు హైకోర్టు షాక్..ధరణి కోసం ఒత్తిడి తేవొద్దు
By: Tupaki Desk | 3 Nov 2020 2:50 PM GMTతెలంగాణలో జరుగుతున్న మరో అతిపెద్ద కార్యక్రమంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదుకు ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని తెంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై దాఖలైన వివిధ పిటిషన్లపై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించవద్దు. వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయొద్దు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్ పార్టీకి ఇవ్వొద్దు. ఏ చట్టం ఆధారంగా ఆధార్, కులం వివరాలను సేకరిస్తున్నారు? కొత్త రెవెన్యూ చట్టం సాగు భూములకు సంబంధించింది మాత్రమే.. వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారు? డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదు. డేటా దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ధరణి పేరిట ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారనే దానిపై పిటీషన్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డేటా దుర్వినియోగం అయితే భద్రతకు విఘాతం కలుగుతుందని హైకోర్టుకు విన్నవించారు. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్ సమాధానమిస్తూ డేటా భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాగా కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.