Begin typing your search above and press return to search.
శివాజీకి గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 7 Aug 2019 3:14 PM GMTగరుడ పురాణం శివాజీకి కొద్ది రోజులుగా కోర్టులు, కేసుల మోత తప్పడం లేదు. అలంద మీడియా గ్రూప్ కేసులో శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివాజీకి ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు నుంచి పెద్ద రిలీఫ్ వచ్చింది. శివాజీ అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. శివాజీ కొద్ది రోజులుగా అమెరికా వెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం శివాజీని దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అలంద మీడియా కేసులో లుకౌట్ నోటీసులున్న నేపథ్యంలో శివాజీని తిరిగి వెంటనే హైదరాబాద్‌కు వెళ్లాల్సిందిగా దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదేశించారు.
ముందుగా శివాజీపై లుకౌట్ నోటీసులు ఉన్నా ఆ తర్వాత వాటిని కాస్త సవరించారు. అప్పుడు శివాజీ దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలకు దుబాయ్ అధికారులు బ్రేక్ వేశారు. శివాజీపై అమెరికా వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని హైదరాబాద్ పోలీసులు అధికారులు చెప్పినా దుబాయ్ లో మాత్రం అతడిని ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టనివ్వలేదు. ఈ క్రమంలోనే బుధవారం కోర్టు అతడు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో గురువారమే శివాజీ అక్కడకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు తనను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారంటూ శివాజీ తరపున న్యాయవాది వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఇదే కేసులో పోలీసుల తరపున వాదిస్తోన్న న్యాయవాది మాత్రం హైకోర్టు ఆదేశాలు వచ్చాక లుకౌట్ నోటీసులు తొలగించేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని చెప్పారు. ఇండియాలో శివాజీని ఎవ్వరూ అడ్డుకోలేదన్న విషయం కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక దుబాయ్ లో అధికారులు అడ్డుకోవడం కూడా కేవలం సమాచార లోపంతోనే జరిగిందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే గురువారం నుంచి శివాజీ అమెరికా వెళ్లేందుకు మూడు వారాల పాటు అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక శివాజీ తరపున వాదిస్తోన్న న్యాయవాది మాత్రం లుకౌట్ నోటీసులు తొలగించాలని కోర్టు చెప్పినా పోలీసులు ఆ చర్యలు తీసుకోకపోవడంతోనే జూలై చివర్లో శివాజీ అమెరికా వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. దీనిని కోర్టు ధిక్కార న్యాయంగా పరిగణించాలని కూడా ఆయన తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించినా కోర్టు మాత్రం ప్రస్తుతానికి శివాజీ మూడు వారాల పాటు అమెరికా వెళ్లేందుకు ఓకే చెప్పింది.