Begin typing your search above and press return to search.
టీహైకోర్టు సంచలనం.. ‘ఆ అత్యాచార బాలిక గర్భాన్ని తీసేయండి’
By: Tupaki Desk | 8 Oct 2021 3:23 AM GMTతెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాల్ని జారీ చేసింది. ఒక అత్యాచార బాలికకు అవాంఛనీయమైన గర్భాన్ని దాల్చటం.. దాన్ని తీసేసే విషయంలో ఆసుపత్రి నిరాకరించటంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. సంచలన తీర్పును ఇచ్చింది. అత్యాచారం కారణంగా అవాంఛనీయమైన గర్భాన్ని దాల్చిన ఆమెకున్న గర్భాన్ని తీసేయాల్సిందేనని స్పష్టం చేసింది.
16 ఏళ్ల బాలికకు 26 వారాల పిండాన్ని తొలగించేందుకు కోఠి ప్రసూతి ఆసుపత్రి నో చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి హైకోర్టు ఆశ్రయించింది. దీంతో ఇరువురి వాదనల్ని విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్ని జారీ చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని అవాంఛనీయ గర్భాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాల్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు జారీ చేసింది.
పిండం హక్కుల కన్నా.. అత్యాచార బాధితురాలి హక్కులే తమకు ముఖ్యమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు ఉంటుందని చెబుతూ.. జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తీర్పును వెలువరించారు. నిజమే.. ఎవడో చేసిన తప్పును మోయటం ఒక ఇబ్బంది అయితే.. పిండం శివువుగా జన్మిస్తే.. దాని భారాన్ని జీవితాంతం మోయాల్సిన అవసరం ఉంటుంది. అది అన్నింటికంటే పెద్ద శిక్ష అన్నది మర్చిపోకూడదు.