Begin typing your search above and press return to search.
కోర్టు ధిక్కార కేసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్
By: Tupaki Desk | 14 Dec 2019 6:50 AM GMTతెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వాధికారులు అమలు చేయకపోవటంపై సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాల్ని అమలు చేయని అంశాలపై కోర్టు ధిక్కార కేసులు పెద్ద ఎత్తున న్యాయస్థానాల ఎదుటకు రావటాన్ని తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కార కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు.
ఒక సింగిల్ జడ్జి ముందు సుమారు 800 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని.. హైకోర్టులో రెండు వేల వరకూ కోర్టు ధిక్కార కేసులు ఉండటాన్ని ప్రస్తావించిన తెలంగాణ హైకోర్టు.. ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? అంటూ కోర్టుకు హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను నిలదీసింది.
కోర్టు ఆదేశాల్ని పాటించకపోవటం వల్లే ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అభిప్రాయ పడింది. కోర్టు ధిక్కార కేసులు ఎక్కువగా రెవెన్యూ.. మునిసిపల్.. రవాణా.. హోంశాఖలపై ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల్ని పాటించాలని అధికారులకు మీరు చెబుతారా? ఆ విషయాన్ని కూడా మమ్మేల్నే నేర్పమంటారా? ఇద్దరు అధికారుల్ని జైలుకు పంపితే మిగిలిన అధికారులు దారికి వస్తారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఒక వ్యాజ్యంలో అప్పీలు చేయటానికి 466 రోజుల ఆలస్యం కావటాన్ని మన్నించాలన్న అభ్యర్థనపై హైకోర్టు న్యాయమూర్తులు స్పందించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల్ని అమలు చేయని వైనంపై ప్రభుత్వం వెనువెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందంటున్నారు.