Begin typing your search above and press return to search.
కొత్తగూడేం గోపాలరావుపై హైకోర్టు అంత ఆగ్రహాన్ని ఎందుకు వ్యక్తం చేసింది?
By: Tupaki Desk | 23 Jun 2021 4:30 AM GMTచాలా అరుదుగా చోటు చేసుకునే పరిణామం తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అతడి తీరును తీవ్రంగా తప్పు పడుతూ అనూహ్య వ్యాఖ్యను చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లోని వివరాల్ని ప్రస్తావిస్తూ.. అతడి తీరును తీవ్రంగా తప్పు పట్టింది.
అధికార పార్టీ అండ చూసుకొని పిటిషనర్ వాస్తవాల్ని తొక్కి పెట్టటమే కాదు.. అధికారుల్ని బెదిరించారని.. న్యాయవాదిపై భౌతికదాడులకు పాల్పడిన వైనాన్ని సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్న వైనంపై స్పందించిన హైకోర్టు.. ‘ఎంత బలవంతుడివో మేమూ చూస్తాం.. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తాం’ అని పేర్కొంది. ఇంతకూ అసలీ వివాదం ఏమిటి? హైకోర్టు ఎందుకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందన్న విషయంలోకి వెళితే.. కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయితీలోని 1200 చదరపు గజాల స్థలంలో వి.గోపాలరావు అనే వ్యక్తి చేపట్టిన నిర్మాణంగా చెప్పాలి.
ఆ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ పంచాయితీ కూల్చివేత నోటీసుల్ని ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు గోపాలరావు. దాన్ని విచారించిన సింగిల్ కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్.. ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించారు. గోపాలరావు మీద చర్యలు తీసుకోవటానికి జిల్లా పంచాయితీ అధికారి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని.. గతంలో పంచాయితీ కార్యదర్శి.. తదితరుల్ని బదిలీ చేయించటమే కాదు.. ఒక వ్యక్తి పిటిషన్ వేయగా.. ఆ వ్యక్తి లాయర్ ను బెదిరించాడు.
కేసు వాపసు తీసుకోవాలని చెప్పినా చేయలేదన్న అక్కసుతో భౌతికదాడులకు పాల్పడ్డారు. తాజాగా గోపాలరావు దాఖలు చేసిన అప్పీలుపై విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి.. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లోని అంశాల్ని పరిశీలించి గోపాలరావు వైఖరిపైన సీరియస్ అయ్యింది. గోపాలరావు అంత బలవంతుడైతే.. ఈ వ్యవహారాన్ని తామే పర్యవేక్షిస్తామని.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని గోపాలరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. మరేం జరుగుతుందో చూడాలి.