Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ...ఏ విషయంలో అంటే !

By:  Tupaki Desk   |   17 July 2021 2:30 PM GMT
కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ...ఏ విషయంలో అంటే !
X
హైదరాబాద్ మహానగరం లోని కోకాపేట, ఖానామెట్ లోని భూములని తెలంగాణ ప్రభుత్వం వేలం వేసిన సంగతి తెలిసిందే. ఆ వేలంలో భూముల రేట్లు కూడా ఎవ్వరూ ఊహించని రీతిలో భారీ ధరకి అమ్ముడైయ్యాయి. ఆ భూముల వేలం విషయంలో ప్రభుత్వంపై విపక్షాలు కొంచెం ఘాటు గానే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది.

భూ వేలంపై కేసీఆర్ సర్కార్ కు ఎదురుదెబ్బ గట్టిగానే తగిలింది. ఖానామెట్ లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఖనామెట్ లో గొల్డెన్ మైల్ లోని 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విక్రయించింది. 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉందని తెలుస్తుంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. స్మశాన వేలాన్ని ఆపాలంటూ హైకోర్టులో స్థానికుల పిటిషన్ వేయగా హైకోర్ట్ ఈ ఆదేశాలు ఇచ్చింది. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు తెలిపారు. తాము సెంటిమెంట్ గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.