Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల ఆక్రోశం...ఆర్నేళ్ల త‌ర్వాత తీర్చిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   21 Sep 2019 7:50 AM GMT
ప్ర‌జ‌ల ఆక్రోశం...ఆర్నేళ్ల త‌ర్వాత తీర్చిన కేసీఆర్‌
X
తెలంగాణ‌లో ఇటీవ‌ల విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాలు సృష్టించిన వివాదం గుర్తుండే ఉంటుంది. వంద మార్కులు సాధించి విద్యార్థికి సున్నా మార్కులు వేయ‌డం - అర్థం ప‌ర్థం లేని ఫెయిల్ రిజ‌ల్ట్స్ వంటివి సంచ‌ల‌నం సృష్టించాయి. తీవ్ర దుమారం రేపిన ఈ ఇంటర్ ఫస్టియర్ - సెకండియర్ – 2019 ఫలితాల వివాదంపై ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అశోక్ వైఖ‌రి మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. “ఫెయిల్ అయ్యిన వాళ్ళు వంద మాట్లాడుతారు….అవి బోర్డ్ పట్టించుకోదు. స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. అవన్నీ బోర్డ్ మీద నెట్టడం సమంజసం కాదు” అని అశోక్ చెప్పడంతో విద్యార్థులు - తల్లిదండ్రులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఆయ‌న్ను వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని...ఇంత నిర్ల‌క్ష‌మా అని మండిప‌డ్డారు. అయితే - దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత తాజాగా ఆయ‌న‌పై బ‌దిలీ వేటు ప‌డింది.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఏ అశోక్‌ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆయన స్థానంలో 1998 బ్యాచ్‌ కు చెందిన సయ్యద్ ఒమర్ జలీల్‌ ను నియమిస్తూ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. 1998 బ్యాచ్ కు చెందిన జలీల్…గతంలో నల్గొండ - వరంగల్ - మెదక్ జిల్లాల జేసీగా పనిచేశారు. ఆ తర్వాత బీసీ - మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా జలీల్ పనిచేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ గా చేసి అక్కడి నుంచి బదిలీ అయిన జలీల్.. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుండ‌గా...తాజా బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు.

కాగా, ఇంట‌ర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. విద్యార్థులు - తల్లిదండ్రులు చెప్పేవి అన్నీ తప్పుడు వార్తలని ఆయన అన్నారు. “ఆన్సర్ షీట్ ఇస్తామని అంటున్నాం. ఇంతకంటే పారదర్శకంగా ఎవరైనా ఉంటారా. మార్కులు ఎందుకు తక్కువ వ‌చ్చాయంటే ఎలా. గ‌ణితంలో బాగున్నవారు.. ఇంగ్లీష్ లో వీక్ ఉండొచ్చు. మీకు ఆన్సర్ షీట్స్ ఇస్తా. రీ వెరిఫికేషన్ చేయడానికి సిద్ధం. 10 లక్షల మంది ఉన్నారు. విద్యార్థులు ఫెయిలవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అనుమానం ఉంటే వెరిఫికేషన్ పెట్టుకోండి” అన్నారు. అధికారి స్థాయిలో ఉండి కూడా అశోక్ ఎదురుదాడి చేసినట్టుగా మాట్లాడటంతో… విద్యార్థులు - తల్లిదండ్రులు బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. అధికారి స్థాయిలో ఉండి కూడా అశోక్ ఎదురుదాడి చేసినట్టుగా మాట్లాడటంతో… విద్యార్థులు - తల్లిదండ్రులు బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అశోక్‌ ను బ‌దిలీ చేయాల‌ని డిమాండ్ చేశారు. అయితే, తాజాగా ఇప్పుడు ఆయ‌న‌పై బ‌దిలీ వేటు వేసింది ప్ర‌భుత్వం. అయితే ఆరు నెలల్లో రిటైర్ అవబోతున్న అశోక్‌ కి కేసీఆర్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.