Begin typing your search above and press return to search.

తెలంగాణ క‌దిలింది.. మ‌రి ఏపీ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   25 Jan 2022 12:30 AM GMT
తెలంగాణ క‌దిలింది.. మ‌రి ఏపీ ఎప్పుడు?
X
ఔను... తెలంగాణ ప్ర‌భుత్వం చాలా ముందుచూపుతో క‌దిలింది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభు త్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ను ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు పలు అంశాల పైన నిర్మలా సీతారామన్కు కేటీఆర్ సవివరమైన లేఖలు రాశారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్లను గుర్తించింద న్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నొడ్ల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సాయాన్ని మరింత వేగంగా కల్పించాలన్నారు. ప్రతిపాది త రెండు నోడ్లలో మౌలిక వసతుల కల్పన చేసేందుకు సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ నాగపూర్ కారిడార్లో భాగంగా మంచిర్యాల నోడ్ను కొత్తగా గుర్తించాలన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్లలోని ఈ మూడు నోడ్లకు 2వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6 వేల కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. క‌ట్ చేస్తే.. మ‌రి పొరుగు రాష్ట్రం ఏపీ స్పందించిందా? అంటే..ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఊసు లేకుండాపోయింది. మ‌రో వారం ప‌ది రోజ‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో అస‌లే ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకునేందుకు సాయం చేయాల‌ని.. ఇటు ప్ర‌భుత్వం నుంచి కానీ, అటు ఆర్థిక శాఖ నుంచి కానీ... లేదా ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి గౌతంరెడ్డి నుంచి కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి గ‌త బ‌డ్జెట్లోనే ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ పెద్ద‌లు ల‌బోదిబో మ‌న్నారు.. ప‌పోల‌వ‌రానికి నిదులు ఇవ్వ‌లేద‌ని.. రైల్వే ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించ‌డం లేద‌ని.. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇవ్వ‌లేదని.. ఇలా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రి ఇప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. కేంద్రాన్ని ఎందుకు కోర‌డం లేద‌నేది ప్ర‌శ్న‌. ఏమాత్రం అడిగి ఉన్నా.. మీడియాకు చెప్పుకుండా ఉంటారా? అనేది సందేహం. సో.. ఇదీ ఏపీ ప‌రిస్థితి.