Begin typing your search above and press return to search.

రాహుల్ ద్రావిడ్ డిమాండ్ కు కేటీఆర్ మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   26 Feb 2018 6:41 AM GMT
రాహుల్ ద్రావిడ్ డిమాండ్ కు కేటీఆర్ మ‌ద్ద‌తు
X
మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్ ద్రావిడ్ డిమాండ్ కు తెలంగాణ ఐటీ మినిస్ట‌ర్ మ‌ద్ద‌తుప‌లికారు. ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా రాహుల్ ద్రావిడ్ అంటే ఇష్టం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశాడు.

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న్యూజిలాండ్ లోని బే ఓవల్ క్రికెట్ గ్రౌండ్స్ లో ముగిసిన ఫైనల్లో...మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను భార‌త్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విశ్వవిజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ జ‌ట్టుకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్య‌త వ‌హిస్తున్న‌విష‌యం తెలిసింది. అయితే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత ఏ దేశ‌మైనా జ‌ట్టు స‌భ్య‌లంద‌రికి న‌జ‌రాలు ప్ర‌క‌టించడం ఓ ఆన‌వాయితి. బీసీసీఐ ఆ ఆన‌వాయితి ప్ర‌కారం అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించిన జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌ కు - ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు - కోచ్ ద్రవిడ్‌ కు రూ.50 లక్షలు సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తున్న‌ట్లు తెలిపింది.

కోచ్ రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ న‌జ‌రానాపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అందరూ సమష్టిగా కృషి వ‌ల్ల వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్నాం. అలాంటప్పుడు తనకు మాత్రం రూ.50 లక్షలు - మిగతా వారికి రూ.20 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వారికంటే తానేమీ ఎక్కువ కష్టపడలేదన్నారు. కాబట్టి ప్రోత్సాహకాలు అందరికీ సమానంగా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

దీంతో రాహుల్ అభిప్రాయాన్ని గౌర‌వించిన బీసీసీఐ అంద‌రికి ఒకేలా న‌జ‌రానాను మ‌రోసారి ప్ర‌క‌టించింది. ఆ బీసీసీఐ ప్ర‌క‌ట‌న తో దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు రాహుల్ ద్రావిడ్ పై అభినంద‌న‌లు తెలుపుతున్నారు. కోచ్ ప‌ద‌వికి కొత్త అర్ధం చెప్పార‌ని అంటున్నారు.

అలా మంత్రి కేటీఆర్ కూడా రాహుల్ ద్రావిడ్ ను ఆకాశానికెత్తారు. కోచ్ గానే కాకుండా మంచి వ్య‌క్తిగా రాహుల్ ద్రావిడ్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మంటూ రాహుల్ పై వ‌చ్చిన క‌థ‌నాల్ని కేటీఆర్ ట్వీట్ చేశారు.