Begin typing your search above and press return to search.

సుడి అంటే కేటీఆర్‌ దేన‌ట‌!

By:  Tupaki Desk   |   29 Nov 2017 12:44 PM GMT
సుడి అంటే కేటీఆర్‌ దేన‌ట‌!
X
ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న బిజినెస్ స‌మ్మిట్ కు సంబంధించిన ఫ‌లితాలు అప్పుడే వెల్ల‌డైపోతున్నాయి. వెంచ‌ర్ క్యాప్ట‌లిస్టులు వ‌చ్చి.. స్టార్ట‌ప్ ల‌కు ధ‌న సాయం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ స‌ద‌స్సులో ఎవ‌రెంత లాభం పొందుతార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. దీని ద్వారా భారీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న‌ది మాత్రం మంత్రి కేటీఆర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక్క‌రోజులో.. అది కూడా ఒక చ‌ర్చా కార్యాక్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్‌.. తన మార్క్‌ను ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాదు.. త‌న సామ‌ర్థ్యం ఎంత‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌భావితం చేసే స‌త్తా ఉన్న మ‌హిళామ‌ణులతో క‌లిసి చ‌ర్చా వేదిక‌ను పంచుకోవ‌ట‌మే కాదు.. వారికి మెంటార్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్రొఫెష‌న‌ల్ మెంటార్ ఎలా అయితే వ్య‌వ‌హ‌రిస్తారో అంతే స్థాయిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

వాణిజ్య‌ప‌ర‌మైన అంశాలపై త‌న‌కున్న ప‌ట్టును ప్ర‌ద‌ర్శించిన కేటీఆర్‌.. ఏ ద‌శ‌లోనూ త‌గ్గ‌లేదు. గంట‌కు పైగా సాగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల చ‌ర్చ‌ల‌కు స‌రితూగేలా వ్యాఖ్య‌లు చేయ‌టం.. చ‌ర్చ‌ను స‌మ‌న్వ‌యం చేసిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇంత‌కాలం మంచి వ‌క్త‌గా పేరున్న కేటీఆర్‌కు.. తాజా ఇమేజ్ నేత‌గా ఆయ‌న్ను మ‌రోస్థాయికి తీసుకెళ్లేలా చేసింద‌ని చెబుతున్నారు. తాజా చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొన్న వైనం చూసిన‌ప్పుడు.. గ్లోబ‌ల్ స్థాయిలో ఆయ‌న‌కు స‌రికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టింద‌న‌టంలో సందేహం లేద‌ని చెప్పాలి.

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో రాజ‌కీయం అంటే రొచ్చు మాట‌లు మాట్లాడ‌టం.. తిట్లు తిట్టుకోవ‌టం మాత్ర‌మే కాద‌ని.. అంత‌కు మించిన విష‌యాలు చాలానే ఉంటాయ‌న్న విష‌యాన్ని కేటీఆర్ స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. రాజ‌కీయం సంగ‌తి ఎలా ఉన్నా.. విష‌య‌ప‌రంగా ప‌ట్టు ఉంటే ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో కేటీఆర్ ఫ్రూవ్ చేశార‌ని చెప్పాలి. ఇక్క‌డ మ‌రో పాయింట్ ఏమిటంటే.. విష‌యం ఉన్న నేత‌లు చాలామంది ఉండొచ్చు. కానీ.. వారికి అవ‌కాశం ద‌క్కాలి. ద‌క్కిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. ఇదంతా చూసిన‌ప్పుడు .. ప్ర‌య‌త్నం.. సుడి క‌ల‌గ‌లిపితే త‌ప్పించి ఇలాంటి ఇమేజ్ రాద‌ని.. అందుకే కేటీఆర్ సుడే సుడ‌న్న మాట ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు.. మీడియా వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది. క‌ష్ట‌ప‌డినోడికి ద‌క్కాల్సింది త‌ప్ప‌కుండా ద‌క్కుతుందంటే ఇదే మ‌రి.