Begin typing your search above and press return to search.

ఢిల్లీ వీధుల్లో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు రోడ్డెక్కారు!

By:  Tupaki Desk   |   4 Sep 2018 4:31 PM GMT
ఢిల్లీ వీధుల్లో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు రోడ్డెక్కారు!
X
జ‌ర్న‌లిస్టులు అన్నంత‌నే ప‌వ‌ర్ సెంట్రిక్ గా ఉంటార‌న్న పేరుంది. నిజ‌మే.. యావ‌ద్దేశంలో ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా.. ఎలాంటి అన్యాయం ఎదురైనా మీడియా ప్ర‌తినిధికి చెప్పుకోవ‌టం ద్వారా త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే అవ‌కాశాన్ని చూస్తారు. ఇలా ఊరు మొత్తం స‌మ‌స్య‌ల్ని త‌ర‌చూ తెర మీద‌కు తెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు సైతం భారీ ఎత్తున పెండింగ్ డిమాండ్లు ఉన్నాయ‌ని.. త‌ర‌చూ అధికార‌ప‌క్షానికి చెందిన ప‌లువురు నేత‌లు.. ప‌లు స్థాయిల్లో ప‌రిచ‌యం ఉన్నా.. త‌మ సంక్షేమం కోసం జ‌ర్న‌లిస్టులు ఎలాంటి ప‌నుల్ని చేసుకోక‌పోవ‌టంపై నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

త‌మ‌కు ఇచ్చిన హామీల్ని అమ‌లు చేసే విష‌యంలో ప్ర‌భుత్వాలు ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 220 మంది జ‌ర్న‌లిస్టులు మృతి చెందార‌ని.. అలాంటి వారి కుటుంబాల‌కు నామ మాత్రంగా సాయం అందింద‌న్నారు.

జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయాలంటూ తెలంగాణకు చెందిన 400 మంది జ‌ర్న‌లిస్టులు ఢిల్లీ రోడ్ల మీద నినాదాలు చేశారు. సేవ్ ధ‌ర్నాలో తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల‌కు చెందిన జ‌ర్న‌లిస్టు సంఘాల‌కు చెందిన నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయ‌కుడికి విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. ఇంత‌కీ.. ఢిల్లీ రోడ్ల మీద‌కు ఎక్కి మ‌రీ త‌మ డిమాండ్ల‌ను వినిపించిన జ‌ర్న‌లిస్టులు ఏం కోరుకుంటున్నారంటే..

1. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు - జర్నలిస్టు కుటుంబాలకు హెల్త్‌ కార్డులు జారీ చేయాలి

2. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల పథకం వెంటనే అమలు చేయాలి

3. వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాన్ని సవరించాలి

4. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి

5. జర్నలిస్టుల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలుఏమిటో చెప్పాలి.

6. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష సాయాన్ని రూ.5లక్షలకు పెంచాలి.

7. ఎలక్ట్రానిక్‌ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి

8. ఎలక్ట్రానిక్‌ మీడియాను వర్కింగ్‌ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తేవాలి

9. మజీథియా వేజ్‌బోర్డు సిఫార్సులు అమలు చేయాలి

10. జర్నలిస్టులకు సక్రమంగా ఆరోగ్య పథకాలు అమలు పరచాలి