Begin typing your search above and press return to search.
జడ్జిల సస్పెన్షన్ కు ధీటుగా జడ్జిల షాకింగ్ నిర్ణయం?
By: Tupaki Desk | 28 Jun 2016 5:07 AM GMTరాష్ట్ర హైకోర్టు విభజన.. జడ్జిల ఆప్షన్ అంశానికి సంబంధించి తెలంగాణ జడ్జిలు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేప్టటటం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో జడ్జిలు చలో రాజ్ భవన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణ జడ్జిస్ అసోసియేషన్ అధ్యక్ష.. కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఒక్కసారిగా వాతావరణం మారిపోయేలా చేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జడ్జిల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
హైకోర్టు తీసుకున్నసస్పెన్షన్ నిర్ణయానికి ధీటుగా తాము అదే తీరులో వ్యవహరించాలని తెలంగాణ జడ్జిల సంగం నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన దాదాపు 200 మంది జడ్జిలు (అన్ని కేడర్ లు కలుపుకొని) మంగళవారం నుంచి మూకుమ్మడిగా సెలవులు పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లీవ్ లెటర్ ఫార్మాట్ ను ఒకటి సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసిన జడ్జిల సంఘం అధ్యక్ష.. ప్రధాన కార్యదర్శుల వేటుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. జడ్జిల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. మంగళవారం నుంచి న్యాయశాఖ ఉద్యోగులూ సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నిరసనల్లో భాగంగా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్వర్యంలో గేటు బయట ఆందోళనకు దిగి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతేకాదు.. సస్పెన్షన్ తీరును నిరసిస్తూ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అసాధారణ సర్వసభ్య సమావేశాన్నినిర్వహించారు. జడ్జిల సస్పెన్షన్ ను తీవ్రంగా ఖండించటంతో పాటు.. సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. తెలంగాణ జడ్జిలకు వ్యతిరేకంగా.. పక్షపాతంతో వ్యవహరిస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలేను వెనక్కి పిలవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించటం గమనార్హం. అంతేకాదు.. సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో విధులను బహిష్కరించాలని తీర్మానించటం గమనార్హం.