Begin typing your search above and press return to search.
మనం వద్దనుకున్నాం..అమెరికా అక్కున చేర్చుకుంది..
By: Tupaki Desk | 23 Nov 2016 10:30 PM GMTఇండియా అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ఇండియా. క్రికెట్ మాయలో పడి భారత్ మిగతా క్రీడలను పక్కనపెడుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దేశంలో మిగతా క్రీడల పరిస్థితి చూసినా అది అర్థమవుతుంది. క్రికెటర్లకు బ్రహ్మరథం పడతారు కానీ, మిగతా ఆటగాళ్లను అసలు గుర్తించనే గుర్తించారు. ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినప్పుడు బహుమతులు ప్రకటించి వదిలేస్తారు. అది కూడా ఈమధ్యే. అంతకుమించి ఇంకెలాంటి ప్రోత్సాహమే ఉండదు. ఈ పరిస్థితుల్లో ఏళ్లుగా అనాదరణకు గురైన తెలంగాణకు చెందిన క్రీడాకారుడు ఒకరు మన దగ్గర ముఖ్యమంత్రులు, మంత్రులను ఆకట్టుకోలేకపోయినా అమెరికా వాళ్ల ఆదరణ పొందాడు. ఆ కృతజ్హతతోనే ఆయన ఇప్పుడు నేను అమెరికన్ ఆటగాణ్ని అంటున్నాడు.
జమీల్ పఠాన్ ఖాన్. తెలంగాణకు చెందిన అంతర్జాతీయ కరాటే మాస్టర్. కుంగ్ ఫూలోనూ ఆరితేరిన మొనగాడు. నిరుపేద అయిన ఆయన గత 16 ఏళ్లలో దాదాపు యాభై అంతర్జాతీయ పతకాలు సాధించాడు. అయినా ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదు. పైసా ప్రోత్సాహకం ఇవ్వలేదు. కెరీర్ ఆరంభించింది మొదలు ఈ 16 ఏళ్లలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఉండటానికి ఇళ్లు, కుటుంబ పోషణ కోసం ఓ ఉద్యోగం ఇప్పించమని నలుగురు ముఖ్యమంత్రులు.. మంత్రులు, కేంద్ర, రాష్ట్ర క్రీడాధికారులను ఎంతగానో వేడుకున్నాడు. అయినా ఫలితం రాలేదు.
చివరకు విసిగిపోయిన ఆయన అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్‌లోని రికుధిజా కేటీవోసీ తరఫున మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆయన ఇప్పటికే అమెరికా తరఫున ఓ టోర్నీలో పాల్గొన్న అతను బంగారు, రజత పతకాలు గెలిచాడు. ఇకపై తాను అమెరికాకే ప్రాతినిధ్యం వహిస్తానని చెబుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సాధిస్తున్న ప్రతిభావంతుడైన క్రీడాకారుడు ఒకరిని వదులుకున్నట్లయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/