Begin typing your search above and press return to search.

తెలంగాణ కికి ఛాలెంజ్.. న్యూయార్క్ ట్రైమ్స్ లో

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:45 PM GMT
తెలంగాణ కికి ఛాలెంజ్.. న్యూయార్క్ ట్రైమ్స్ లో
X
కికి ఛాలెంజ్.. కొన్ని రోజులుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న విన్యాసం. ఒక పాప్ సాంగ్ ప్లే అవుతుండగా.. కార్లోంచి దిగి.. అది నడుస్తుండగా డ్యాన్స్ చేసే ఈ ఛాలెంజ్ ను చాలామంది సెలబ్రెటీలు స్వీకరించారు. సామాన్యులూ ట్రై చేశారు. ఐతే ఈ ఛాలెంజ్ కొంచెం ప్రమాదకరంగా ఉండటంతో దీన్ని అనుసరించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలామంది దీన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఐతే కికి ఛాలెంజ్ కు పేరడీగా తెలంగాణ రైతులిద్దరు చేసిన వీడియో ఈ మధ్య సూపర్ పాపులర్ అయింది. ఎద్దులతో పొలం దున్నుతూ పాప్ పాటకు వాళ్లు డ్యాన్స్ చేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రపంచ స్థాయిలోనూ పాపులర్ అయింది.

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా మాన్యాలి మండలం లంబాడిప‌ల్లికి చెందిన అనిల్ కుమార్.. పిల్లి తిరుప‌తి... .శ్రీ‌కాంత్... కలిసి ఈ వీడియోను రూపొందించారు. జోడెద్దులు ముందుకు సాగిపోతుండ‌గా కాసేపు వాటి క‌ళ్లేల‌ని.. నాగ‌ళ్ల‌ను వదిలేసి...`కికి డు యు ల‌వ్ మీ` పాట‌కు డ్యాన్స్ చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాటిని అందుకొని ఛాలెంజ్ పూర్తి చేశారు.

ఆ వీడియోను అనిల్.. తిరుప‌తిల మిత్రుడైన షార్ట్ ఫిల్మ్ ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ త‌న యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. దీంతో, అది వైర‌ల్ అయింది. వీరిని ఇప్పటికే బీబీసీ తెలుగు వాళ్లు ఇంటర్వ్యూ కూడా చేశారు. తాజాగా వీరి గురించి ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించడం విశేషం. ఓ అమెరిక‌న్ వ్యాఖ్యాత వీరి వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అది చూసి దీనిపై న్యూయార్స్ టైమ్స్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. దీంతో ఆ వీడియో మరింతగా పాపులర్ అయింది.