Begin typing your search above and press return to search.
గుడ్లగూబల కోసం తెలంగాణ నేతల వెతుకులాట
By: Tupaki Desk | 4 Dec 2018 9:25 AM GMTవిజయం సాధించాలి. అసెంబ్లీలో అడుగుపెట్టాలి. ఐదేళ్లు అధికారంలో ఉండాలి. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలందరి ఆకాంక్ష ఇదే. ఇందుకోసం వారంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. ప్రచార పర్వంలో భాగంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
అభ్యర్థుల్లో చాలామంది స్వశక్తిని - తమ పార్టీ బలాలను - అంగబలం- అర్థబలాన్ని నమ్ముకుంటున్నప్పటికీ కొందరు మాత్రం మూఢనమ్మకాల బాటపడుతున్నట్లు తెలుస్తోంది. క్షుద్రపూజలను కూడా జరిపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు - వారి నుంచి అదృష్టాన్ని దూరం చేసేందుకు ఈ పూజలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని సేడం పట్టణంలో ఇటీవల కొందరు వేటగాళ్లు రెండు గుడ్లగూబలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన విషయాలను విని పోలీసులు అవాక్కయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ గుడ్లగూబలు కావాలని తమను పురమాయించారని వారు చెప్పడమే అందుకు కారణం. క్షుద్ర పూజలు జరిపించి గుడ్ల గూబలను బలిస్తే ప్రత్యర్థులకు కీడు జరుగుతుందన్నది వారి విశ్వాసమని కూడా నిందితులు చెప్పారట.
ఒక్కో గుడ్ల గూబను తెలంగాణ నేతలు రూ.3-4 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారని కూడా వివరించారట. ఇప్పటికే చాలా గుడ్లగూబలను తెలంగాణకు తరలించామని కూడా చెప్పారట. క్షుద్రపూజలు, మూఢ నమ్మకాలను విశ్వసించే ఇలాంటి నేతలు అధికారంలోకి వస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!