Begin typing your search above and press return to search.
గ్రేటర్ లీడర్స్ ఇంట్లో పులులా? పిల్లులా?
By: Tupaki Desk | 29 Jan 2016 9:30 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సవాళ్లు - ప్రతిసవాళ్లు విసరుతులూ... భారీ భారీ కామెంట్లు చేస్తూ... పెద్ద పెద్ద హామీలిస్తూ తిరుగుతున్న ప్రధాన నాయకులు అసలు తమ సొంత డివిజన్ లలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులను ఏమేరకు గెలిపించగలరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సవాళ్లు విసురుతున్న ఆయా పార్టీల ముఖ్య నేతల భవిష్యత్తు ఫిబ్రవరి 2న తేలనుంది.
అధికార టీఆర్ ఎస్ - బీజేపీ - టీడీపీ - కాంగ్రెస్ - ఎంఐఎం పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, తాము ప్రాతినిథ్యం వహిస్తోన్న వారి వారి స్వంత డివిజన్లలో సొంత పార్టీ అభ్యర్థులను ఎంతవరకూ గెలిపి స్తారన్న అంశంపై, నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రచారం నిర్వహిస్తోన్న సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ - ఏపి సీఎం చంద్రబాబు - కేంద్రమంత్రి దత్తాత్రేయ - మంత్రులు వారు ప్రాతినిథ్యం వహిస్తోన్న డివిజన్లలో సొంత పార్టీల పరిస్థితి ఏమిటనేది సర్వత్రా నెలకొంది. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా బౌద్దనగర్ డివిజన్ కు చెందిన పార్శిగుట్టను కేసీఆర్ దత్తత తీసుకోగా..హైదర్ నగర్ డివిజన్ ను కేటీఆర్ దత్తత తీసుకున్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న పార్శీగుట్ట సికింద్రాబాద్ నియోజవవర్గం బౌద్ధనగర్ డివిజన్ లో ఉంది. అక్కడ మంత్రి పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అక్కడ పోటీ ప్రధానంగా టీఆర్ ఎస్ - బిజెపి మధ్య ఉంది. కేసీఆర్ దత్తత తీసుకున్న డివిజన్ కావడంతో కేంద్రమంత్రి దత్తాత్రేయ - కిషన్ రెడ్డి వంటి నేతలంతా అక్కడే దృష్టి సారిస్తారు. ఇది అటు మంత్రి పద్మారావుకూ ప్రతిష్ఠాత్మకమే. ఆజంపుర డివిజన్ లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బర్కత్ పుర - మంత్రి తలసాని మారేడుపల్లి - జూబ్లీహిల్స్ డివిజన్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు - మాగంటి గోపీనాథ్ - టీఆర్ ఎస్ ఎంపీ కవిత - బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి - ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తదితర నేతలు ఓటర్లుగా ఉంటున్నారు. మరి వారి ఇలాకాల్లో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారో? వేచి చూడాలి.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాంనగర్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బర్కత్ పుర - ఎమ్మెల్యే లక్ష్మణ్ గాంధీనగర్ డివిజన్ లో ఓటర్లుగా ఉన్నారు. ఇక ఎంఐఎం పార్టీకి చెందిన అగ్రనేత అసదుద్దీన్ ఓవైసీ హిమాయత్ నగర్ లో ఉంటూ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. స్వంత పార్టీ అభ్యర్థుల గెలపుకోసం నగరం నలుమూలలు పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా..వారి ఇలాకాలో మాత్రం ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.