Begin typing your search above and press return to search.
విమోచన దినోత్సవ వేడిని రగిలిస్తున్నారుగా?
By: Tupaki Desk | 10 Sep 2019 11:33 AM GMTతాము గురి పెట్టిన తర్వాత.. ఎలాగైనా.. ఏమైనా టార్గెట్ ను పూర్తి చేసే అలవాటున్న మోడీషాలకు తగ్గట్లే.. వారి ప్లానింగ్ ఉంటుంది. ఇటీవల తెలంగాణను తమ టార్గెట్ గా చేసుకున్న కమలనాథులు.. అందుకుతగ్గట్లే ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు పలు అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న బీజేపీ.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది.
నిజాంపై సైనిక చర్యను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇతర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. ఇందుకు కేసీఆర్ ససేమిరా అంటున్నారు. తన మిత్రుడు మజ్లిస్ మనసుకు కష్టం కలగకుండా ఉండేందుకు విమోచన దినోత్సవానికి కేసీఆర్ నో చెప్పేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పొలిటికల్ మైలేజీతో పాటు.. భావోద్వేగాన్ని రగిలించేందుకు వీలుగా ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్ని నిర్వహించటంతో పాటు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు.. కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షానుతెలంగాణకు తీసుకురావటం ద్వారా భారీ ఎత్తు వేసింది బీజేపీ. తెలంగాణ విమోచన దినోత్సవానికి సమయం దగ్గర పడుతున్న వేళ.. బీజేపీ నేతలు గొంతులు సవరించుకుంటున్నారు.
ఇదే అంశంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించే విషయంలో కేసీఆర్.. మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత ఆ డిమాండ్ను వెనక్కి తీసుకోవటానికి కారణం ఏమిటో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
పవర్లోకి రాగానే కేసీఆర్ మాట మార్చారని.. కేసీఆర్ తన భుజాలపై ఓవైసీ బ్రదర్స్ ను కూర్చోబెట్టుకొని ఊరేగుతున్నారన్నారు. మజ్లిస్ చేతుల్లో టీఆర్ ఎస్ ను బందీగా మారిందన్న వ్యాఖ్య చేసిన కిషన్ రెడ్డి..కేసీఆర్.. ఓవైసీ చేతుల్లో తెలంగాణ బందీగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే.. తెలంగాణ విమోచన దినోత్సవానికి అవసరమైన వేడిని రగిలించే విషయంలో బీజేపీ నేతలు పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లుగా అనిపించక మానదు.