Begin typing your search above and press return to search.

గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన కేసీఆర్ ప్ర‌య‌త్నం

By:  Tupaki Desk   |   8 Oct 2016 4:50 PM GMT
గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన కేసీఆర్ ప్ర‌య‌త్నం
X
ఏది చేసినా భారీగా ఉండాల‌ని చూసే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న భారీ త‌నంతో తెలంగాణ రాష్ట్రాన్ని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికే ప్ర‌త్యేక‌మ‌యిన పూల పండుగ బ‌తుక‌మ్మ సంద‌ర్భంగా మ‌హా బ‌తుక‌మ్మ పేరుతో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బ‌తుక‌మ్మ సంబ‌రాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక సంద‌ర్భంగా తెలంగాన రికార్డు సాధించింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన మహా బతుకమ్మ వేడుకలో ఒకే చోట - ఒకేసారి 9,292 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను ఆడి చరిత్ర సృష్టించారు. మొత్తంగా 10,029 మంది మహిళలు స్టేడియానికి తరలివచ్చారు. మహా బతుకమ్మకు గిన్నిస్ బుక్ లో చోటు లభించడంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉన్నది. దీనిని బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించి చరిత్ర సృష్టించింది.

స్టేడియం మధ్యలో ఈ 20 అడుగుల బతుకమ్మను ఉంచి దాని చుట్టూ చిన్నపాటి బతుకమ్మలను ఉంచారు. 35 వరుసలలో 2 వేల మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఉయ్యాల పాటలతో స్టేడియం మార్మోగిపోయింది. మ‌హా బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జోరు వానలోనూ పది వేలమంది మహిళలతో గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చూడముచ్చటగా బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు సందర్భానుసారంగా పాటలు పాడుతూ సందడి చేశారు. కోలాటాలు - డప్పులు - నృత్యాలతో ఆడపడుచులు కనువిందు చేశారు. చూస్తుంటే తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను గిన్నీస్ రికార్డులోకి ఎక్కించేలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక‌త సాధించుకున్నార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/