Begin typing your search above and press return to search.
జనగామ కుర్రాడి అభిమానానికి ట్రంప్ ఫిదా..ట్వీట్
By: Tupaki Desk | 22 Jun 2018 7:26 AM GMTఎక్కడ ట్రంప్? ఎక్కడ జనగామ? కానీ.. తన అభిమానంతో ట్రంప్ మనసును దోచేసుకున్నాడు జనగామకు చెందిన యువకుడు ఒకరు. ఊహించేందుకు కూడా మనసొప్పని ఈ ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అవతలోడు ఎలాంటోడైనా.. ఎంతటి స్థానంలో ఉన్నా వారిని నిజాయితీగా అభిమానిస్తే.. వారిని పిచ్చిగా ప్రేమిస్తే.. వారి ప్రేమకు ఏదో ఒక రోజు ఫలితం లభిస్తుందన్న నిజం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే యమా ఇష్టం. అదిప్పుడు మొదలైంది కాదు.చాలా ఏళ్ల క్రితం ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూ ఈ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వచ్చే వారు. ఆ కార్యక్రమాన్ని కృష్ణ చూసేవాడు. అప్పటి నుంచి ట్రంప్ అంటే అభిమానం.. ఇష్టం.
అది అంతకంతకూపెరుగుతూనే వచ్చింది. అమెరికా అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన తర్వాత మరింత ఎక్కువైంది. ఏడాదిగా తన ఇంట్లో ట్రంప్ ఫోటోను పూజించటం.. వేలు కోసుకొని రక్తతర్పణ ఇవ్వటం లాంటివి చేస్తుంటాడు కృష్ణ. ట్రంప్ కోసం తన పూజల ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టాడు. కృష్ణ ఆరాధించే తీరు ట్విట్టర్ మాథ్యమం ద్వారా ఈ విషయం ట్రంప్‌కు చేరింది.
ఈ నెల19న ట్రంప్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. కోట్ల మంది భారతీయుల్లో కృష్ణను తన ఆప్త మిత్రుడిగా భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్.. త్వరలోనే కలుద్దామంటూ పేర్కొన్నారు. తన ఆరాధ్య దైవం స్వయంగా రియాక్ట్ కావటంతో కృష్ణ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.