Begin typing your search above and press return to search.

బాబుతో ప‌వ‌న్ దోస్తీ!...'న‌మ‌స్తే' సంచ‌ల‌న క‌థ‌నం!

By:  Tupaki Desk   |   29 March 2019 2:09 PM GMT
బాబుతో ప‌వ‌న్ దోస్తీ!...న‌మ‌స్తే సంచ‌ల‌న క‌థ‌నం!
X
ఏపీలో ఎన్నిక‌ల హీట్ తెలంగాణ‌కు కూడా తాకుతోంది. ఏపీలో జ‌రిగే అసెంబ్లీ - లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు సంబంధించిన పార్టీలేవీ పోటీలో లేన‌ప్ప‌టికీ... ఏపీ సీఎం హోదాలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌దే ప‌దే టీఆర్ ఎస్‌ - ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ - కేసీఆర్ స‌ర్కారుపై అదే ప‌నిగా ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ సాగుతున్నారు. ఇక చంద్ర‌బాబుతో పొత్తు తెంచుకుని సింగిల్‌గానే బ‌రిలోకి దిగిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా చంద్ర‌బాబును తిట్ట‌డం మానేసి... తెలంగాణ‌లో ఏపీ వాళ్ల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగిపోతోంద‌ని కూడా కొత్త పాట అందుకున్నారు. ఈ విష‌యాన్నింటినీ చాలా జాగ్ర‌త్త‌గానే కాకుండా చాలా ఆసక్తిగానే గ‌మ‌నిస్తూ వ‌స్తున్న కేసీఆర్ అండ్ కో.. ఈ ఆరోప‌ణ‌ల‌పై మాట మాత్రంగా కూడా స్పందించ‌డం లేదు. అయితే కేసీఆర్ సొంత పత్రిక‌గా ముద్ర‌ప‌డిన *న‌మస్తే తెలంగాణ* ప‌త్రిక నేటి తన సంచిక‌లో సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. న‌మ‌స్తే ప‌త్రిక చెప్పిందంటే... ఆ మాటల‌న్నీ కేసీఆర్ నోట నుంచి వ‌చ్చిన‌ట్టుగానే భావించాల‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో న‌మ‌స్తే ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం కేసీఆర్ సొంత అభిప్రాయంగానే భావించక త‌ప్ప‌దు.

అయినా ఆ క‌థ‌నంలో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ‌లో ఆస్తులు ఉన్న టీడీపీ నేత‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న తెలంగాణ స‌ర్కారు... వారిని వైసీపీ మ‌ద్దతుగా నిల‌వాల‌ని - లేదంటే వైసీపీలోనే చేరిపోవాల‌ని ఆదేశాలు జారీ చేస్తోంద‌ట‌. మాట విన‌ని వారి ఆస్తులకు సంబంధించిన చిన్న చిన్న లోపాల‌ను బ‌య‌ట‌కు తీసేసి వాటిని మార్క్ చేస్తూ భీతిల్లేలా చేస్తోందట‌. ఈ మాట‌ల‌ను ముందుకు చంద్ర‌బాబు అందుకుంటే... ఆ త‌ర్వాత ప‌వ‌న్ కూడా అదే మాట‌ల‌ను అందుకున్నార‌ని ఆ ప‌త్రిక ఆరోపించింది. అంతేకాకుండా ఈ మాట‌ల‌తో ప‌వ‌న్ చంద్ర‌బాబు చేతిలోనే ఉన్నార‌ని, చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే ప‌వ‌న్ న‌డుచుకుంటున్నార‌ని - మొత్తంగా చంద్ర‌బాబు - ప‌వ‌న్ మ‌ళ్లీ క‌లిసిపోయార‌ని తేల్చేసింది. చంద్ర‌బాబు - ప‌వ‌న్ వాద‌న‌లోని వాస్త‌వ‌మెంత‌? అన్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన ఆ క‌థ‌నం... మ‌రి హైద‌రాబాదులోనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి - నాగ‌బాబు... మొత్తంగా మెగా ఫ్యామిలీ భారీ ఆస్తుల‌తో ఎలా ప్ర‌శాంతంగా జీవిస్తోంద‌ని ప్ర‌శ్నించింది. అంతేకాకుండా టీడీపీకే చెందిన సీఎం ర‌మేశ్ - సుజ‌నా చౌద‌రి - రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వంటి వారు లెక్క‌లేన‌న్ని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ కూడా తెలంగాణ‌లోనే ఎలా ప్ర‌శాంతంగా జీవిస్తున్నార‌ని కూడా ఆ క‌థ‌నం ప్ర‌శ్నించింది.

మొత్తంగా చంద్ర‌బాబు - ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపిస్తున్న‌ట్లుగా తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌ల ప‌రిస్థితి అంత హీనంగా ఏమీ లేద‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల మాదిరే... ఏపీ ప్ర‌జ‌లు కూడా తెలంగాణ‌లో ప్ర‌శాంతంగానే జీవిస్తున్నార‌ని కూడా చెప్ప‌క‌నే చెప్పింది. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి ఎలాంటి స‌మాధానాలు వ‌స్తాయో చూడాలి. అంతేకాకుండా అస‌లు ప‌వ‌న్ ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిచ్చే సాహ‌సం చేస్తారా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మవుతున్నాయి. మొత్తంగా ఏపీ వేదిక‌గా తెరాస‌పై నిప్పులు క‌క్కుతున్న పార్టీలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు విప్ప‌కుండానే స‌మాధానం చెప్పేశార‌న్న మాట‌. అంతేకాకుండా త‌మ‌ను రెచ్చ‌గొట్టి - త‌మ‌తో ఏవో మాట‌లు మాట్లాడించి ఏపీ ప్ర‌జ‌ల్లో లోకల్ ఫీలింగ్‌ ను ర‌గిల్చి ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని అటు టీడీపీతో పాటు ఇటు జ‌న‌సేన కూడా య‌త్నిస్తున్నాయ‌న్న మాట‌ను న‌మ‌స్తే తెలంగాణ క‌థ‌నం బట్ట‌బ‌య‌లు చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.