Begin typing your search above and press return to search.
తెలంగాణ వారికి ఇవాళ ఏ ‘దినం’?
By: Tupaki Desk | 17 Sep 2022 4:30 AM GMTక్యాలెండర్ లో ప్రతి ఏడాది వచ్చే ఒక తేదీని.. ఎలా నిర్వహించుకోవాలి? ఏమని నిర్వహించుకోవాలన్న సమస్య దేశంలో మరే రాష్ట్రంలో రాదేమో? ఆ సిత్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది తెలంగాణ రాష్ట్రం. సెప్టెంబరు 17ను ఏ విధంగా నిర్వహించుకోవాలి? దానికి ఏ పేరును ఫాలో కావాలన్న కొత్త సమస్య ఈ ఏడాది ఏర్పడింది.అన్ని దశాబ్దాలు సాగిన ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎదురుకాని ఈ సమస్య.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలోనూ ఎదురవ్వలేదు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సెప్టెంబరు 17ను ఏమని నిర్వహించుకోవాలన్న సందేహం తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఏర్పడింది.
దీనికి కారణం ఎవరికి వారు వారి.. వారి వాదనలు వినిపిస్తూ సెప్టెంబరు 17కు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోవటమే అసలు సమస్య. నిజాం రాజు ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత సైన్యం చేపట్టిన పోలీసు చర్యతో నాటి హైదరాబాద్ కు సెప్టెంబరు 17న స్వాతంత్య్రం రావటం తెలిసిందే. ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా కొందరు.. విలీన దినోత్సవంగా మరికొందరు అభివర్ణిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే చర్చ ఉన్నా.. ఎప్పుడూ కూడా ఇదో హాట్ టాపిక్ గా మారింది లేదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తాము నిర్వహిస్తామని పదే పదే చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారపక్షంగా వ్యవహరిస్తున్న అదే టీఆర్ఎస్.. అదే కేసీఆర్ మాత్రం ఇప్పుడు విలీన దినంగా.. సమైక్యతా దినంగా పేర్కొంటున్న వైనంపై బీజేపీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ.. కొత్త రాష్ట్రంలోనూ బీజేపీ డిమాండ్ మొదట్నించి ఒకటే. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలనే డిమాండ్ ను వినిపిస్తూ ఉన్నారు. కాకుంటే.. గడిచిన ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంత పట్టుదలను ప్రదర్శించటమే కాదు.. సెప్టెంబరు 17కు కొత్త అటెన్షన్ ను తీసుకువచ్చిన క్రెడిట్ బీజేపీకే దక్కుతుంది. ఇప్పుడా పార్టీ కానీ విమోచన దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు కేంద్రం రియాక్టు కాని పక్షంలో.. కేసీఆర్ సర్కారు ఇప్పుడు చేస్తున్న హడావుడి ఏమీ చేసేది కాదన్నది సత్యం.
సెప్టెంబరు 17ను ఒక్కో పార్టీ ఒక్కోలా అభివర్ణిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినంగా ఉత్సవాలు చేస్తుంటే.. అందుకు భిన్నంగా బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవంగా అభివర్ణిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఇఖ.. కాంగ్రెస్ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ సంబరాలు నిర్వహిస్తున్నాయి. ఇక.. కమ్యునిస్టులు మాత్రం విద్రోహ దినంగా పేర్కొంటున్నారు. అసలీ వివాదానికి మూలం.. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజ్యంపై భారత సైన్యం పోలీసు చర్య చేపట్టటం.. ఆ సందర్భంగా నిజాం భారత్ కు లొంగిపోతూ.. తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. దీంతో.. ఇవాల్టి రోజును ఉదారవాదులు విలీన దినంగా పేర్కొంటూ.. సంప్రదాయవాదులు మాత్రం విమోచన దినంగా పేర్కొంటున్నారు. మరి.. మీరే ‘దినం’గా ఫీల్ అవుతున్నారు?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.