Begin typing your search above and press return to search.

జనసేనానిని పట్టుకుని ఎంత మాట అనేశారు!

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:22 PM GMT
జనసేనానిని పట్టుకుని ఎంత మాట అనేశారు!
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోనే రాజకీయాలు చేస్తూంటారు. ఆయనకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమాన గణం ఉంది. ఆ మాటకు వస్తే తెలంగాణాలోనూ జనసేన నాయకులు ఉన్నారు. అయినా ఆయన రాజకీయ కార్యక్షేత్రంగా ఏపీనే ఎంచుకున్నారు.

తెలంగాణా రాజకీయాల్లో ఆయన కనీసమాత్రంగా కూడా జోక్యం చేసుకోరు. పైగా అనేక సార్లు కేసీయార్ పాలన బాగుందని మెచ్చుకుంటారు. తెలనగణా పోరాటాన్ని కూడా ఏపీ గడ్డ మీద నిలిచి కొనియాడతారు. ఒక విధంగా పవన్ తెలంగాణా రాజకీయాల పట్ల అంత జాగ్రత్తగా ఉంటారని అందరూ అంటారు.

అలాంటిది పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ఒక మంత్రి గారికి టార్గెట్ అయిపోయారు. ఆయన జనసేనానిని పట్టుకుని ఏకంగా అవివేకి అనేశారు. ఆయనకు ఏమీ తెలియదు అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ అన్నదేంటి చేసిన తప్పేంటి అంటే ఆయన ఈ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇప్పటం ప్రజలతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వచ్చాకనే తెలంగాణాలో ప్రజలు వరి ఎక్కువగా వాడడం మొదలెట్టారని అన్నారు.

ఎన్టీఆర్‌ పేదలకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారని, మంచి పాలన తీసుకుని వచ్చారని కీర్తించారు. ఆయన చవకగా బియ్యం ఇవ్వడం వల్లనే తెలంగాణాలో ప్రజలు వాటిని వినియోగించడం ఎక్కువ చేసుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. అంతకు ముందు పండుగలు, కీలకమైన సందర్భాలలో తప్పించి వరిని వాడడం లేదు అని ఆయన అన్నారు.

ఇక్కడ పవన్ అన్నది వరి అన్నాన్ని తెలంగాణా ప్రజలకు పరిచయం చేసింది ఎన్టీఆర్‌ అని ఎంతమాత్రం కాదు. వరి అన్నం వినియోయం పేదలు సైతం చేసేలా ఎన్టీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పడమే. పవన్ ఉద్దేశ్యం ఇంత మంచిగా ఉంటే తెలంగాణా మంత్రి నిరంజన్ రెడ్డికి మాత్రం వేరే అర్ధాలుగా తోచింది.

అంతే ఆయన పవన్ మీద విరుచుకుపడిపోయారు. వరిని తెలంగాణా వారికి పండించడం రాదా అంటూ కధను ఎక్కడికో తీసుకుపోయారు. ఎన్టీఆర్‌ వచ్చేంతవరకూ వరి గురించే తమకు తెలియదా అంటూ చాలానే అన్నారు. వేయ్యేళ్ళకు మునుపే తెలంగాణాలో వరి వ్యవసాయం సాగిందని, కాకతీయులు, రెడ్డి రాజుల ఏలుబడిలో నీటి సదుపాయాలు ఎక్కువగా ఉండేవని, చెరువులు, గుంటలు ఇతర సాగు నీటి మార్గాలను నాటి రాజులు జనాలకు అందించారని, అలా వరి పండించడం బియ్యం తినడం అన్నది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అని ఆయన చెప్పుకొచ్చారు.

సరే తెలంగాణా చరిత్ర చాలా ఘనమైనది, ఎన్నో వందల ఏళ్ళ నుంచే వరి వ్యవసాయం చేయవచ్చు కానీ కడు పేదలు, బీదలకు చవకగా అదే వరి బియ్యాని ఎన్టీఆర్‌ అందించారు అని పవన్ చెప్పడంతో తప్పు ఎక్కడ ఉందే సదరు మంత్రి గారికే తెలియాలి అని అంటున్నారు. తెలంగాణా ప్రాంతాన్ని పవన్ చిన్న చూపు చూస్తున్నారు అని మంత్రి గారు అనుమానించడంలో కూడా అర్ధం లేదని కూడా అంతా అంటున్నారు.

అంతే కాదు మరోసారి ఏపీ మీద టీయారెస్ మంత్రి తన అక్కసు వెళ్లగక్కరు. ఉమ్మడి ఏపీలో తెలంగాణాకు తీరని అన్యాయం జరిగిందని, సగు నీటి వనరులు ఏపీ పాలకులు నాశనం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. మొత్తానికి తమ ప్రాంతం చరిత్ర తెలుసుకోకుండా పవన్ ని రాధార వ్యాఖ్యలు చేస్తున్నారు అని నిరంజన్ రెడ్డి అనడే విశేషం.

అయితే దాని కంటే ముందు పవన్ అన్న దాంటో అసలైన కంటెంట్ ని మంత్రి గారు పట్టుకోగలిగారా అన్నది కూడా కీలకమైన ప్రశ్న. పవన్ ఎపుడూ అలా తెలంగాణాను విమర్శించరని ఆయన ట్రాక్ రికార్డు కూడా చెబుతోంది. అయినా సరే పవన్ని ఆయన పేరితో ఏపీ మీద మంత్రి గారు నోరు చేసుకోవడం అంటే ఏంటో ఈ రాజకీయాలు. ఇక్కడ రామా అంటే బూతుగా వినిపిస్తోందిగా అనిపించక మానదు కదా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.