Begin typing your search above and press return to search.
మాటలన్నీ గోదాట్లో కలిపేసి... జగన్ తో మంత్రి పువ్వాడ...
By: Tupaki Desk | 3 Aug 2022 3:28 PM GMTమాటలకేముంది అలా గాలిలో వచ్చి ఇలా గాలిలో కలిసిపోతాయి. వాటినే నిజాలు అనుకుంటే ఎవరైనా పప్పులో కాలేసినట్లే. అందులోనూ రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలు పరమార్ధాలు వేరుగా ఉంటాయి. ఏదో అనాలి కదా అని నోటికి పనిచెప్పే వారే ఎక్కువగా ఉంటారు. కళ్ళెర్రచేసి మీడియా ముందు గుడ్లుమిరితే నిజమే అనుకునేరు. అది అసలు కానే కాదు. అందుకే చాలా బంధాలు ఇప్పటికీ గట్టిగా ఉంటాయి.
అలాంటి ఒక గమ్మత్తైన బంధం ఇపుడు అంతా చూస్తున్నారు. తెలంగాణా మంత్రి, ఏపీకి సరిహద్దున ఉన్న జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ ఏపీ మీద ఈ మధ్య చేసిన ఘాటు వ్యాఖ్యలు అతి పెద్ద రచ్చనే రేపాయి.
మీరు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు..ఇక్కడ మా కొంప ముంచుతున్నారు అంటూ పువ్వాడ పెట్టిన మాటల చిచ్చు ఏపీ వర్సెస్ తెలంగాణా అన్నట్లుగా వివాదం రాజేసింది. పోలవరం కట్టొద్దు అని కూడా ఆయన అన్నారు. అక్కడ గ్రామాలను తెలంగాణాలో కలిపేయాలని కూడా పిలుపు ఇచ్చారు.
దీంతో ఏపీ మంత్రులకూ మండుకొచ్చింది. ముందు ఏపీలో తెలంగాణాను కలిపేయండి అంటూ ఇటూ వాయించేశారు. ఇవన్నీ ఇలా ఉంటే అటు గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారు కూడా కౌంటర్లేశారు. ఈ నేపధ్యంలో అసలు వివాదానికి కారకుడు అయిన పువ్వాడ మాత్రం చల్లగా ఒక ఫైన్ మధ్యాహ్నం జగన్ ఇంటికి సతీసమేతంగా చేరుకున్నారు. జగన్ దంపతులతో పువ్వాడ దంపతులు భేటీ అయ్యారు. నవ్వుల పువ్వులు చిందించారు.
ఇంతకీ మ్యాటరేంటీ అంటే పువ్వాడ కుమారిడి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్ కోసం తాడేపల్లికి పువ్వాడ విచ్చేశారు అన్న మాట. జగన్ కి శాలువా కప్పేసి కార్డు ఇచ్చేసి మరీ ముచ్చట్లు పెట్టారు. దీని చూసిన వారు వార్నీ పువ్వాడ అక్కడలా ఇక్కడిలా ఏంటిది అనుకున్నారు. అయితే దీనికి పువ్వాడ మంత్రి గారు బాగానే క్లారిటీ ఇచ్చారు. నా తండ్రి గారికి వైఎస్సార్ మంచి మిత్రుడు. ఇక నాకు జగన్ మంచి ఆప్తుడు. అందుకే మా బంధాలు బహు గట్టివి అంటూ వ్యవహారం తేల్చేసారు.
మొత్తానికి చూస్తే అటు పువ్వాడ మోమున నవ్వులు, ఇటు జగన్ నిండా చిరునవ్వులు చిందితూ ఫోటోలకు ఫోజు ఇస్తూంటే వారెవ్వా రాజకీయమా అనిపించకమానదు. ఏది ఏమైనా రాజకీయాల కంటే బంధాలే గొప్పవి. అది మళ్లీ మళ్లీ రుజువు అయింది అన్న మాట.