Begin typing your search above and press return to search.
మిస్ అయిన మంత్రిగారి కడియం దొరికేసిందోచ్..
By: Tupaki Desk | 15 Feb 2020 9:29 AM GMTచూసేందుకు చిన్నగా అనిపించే కొన్ని విషయాలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటిదే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్ కడియం.. నాటకీయ పరిణామాల మధ్య మిస్ కావటం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా దేవర కద్ర లో జరిగిన పెళ్లి వేడుక కు మంత్రివర్యులు హాజరు కావటం.. ఆయనతో సెల్ఫీల కోసం పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం కావటం తెలిసిందే.
వారి ఉత్సాహం చూసిన శ్రీనివాస్ గౌడ్ మురిసి పోయి.. ఫోటోలకు ఫోజులు ఇవ్వటం.. అంతా అయ్యాక చూసుకుంటే చేతికి ఉండే సెంటిమెంట్ కడియం మిస్ అయిన విషయం తెలిసి చిందులు తొక్కారు. చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది.. వ్యక్తిగత సిబ్బంది ఇలాంటివి గమనించరా? అంటూ ఫైర్ అయ్యారు. సెంటిమెంట్ కడియం మిస్ కావటాన్ని జీర్ణించుకో లేని ఆయన.. పోయిన కడియం ఎవరికైనా దొరికితే.. దాన్ని తిరిగి ఇస్తే రూ.లక్ష నజరానాను ప్రకటించారు కూడా.
మంత్రిగారి ప్రకటన బాగానే వర్క్ వుట్ అయ్యింది. కడియం పోయిందన్న విషయంపై పలువురు సీరియస్ గా తీసుకొని వెతకగ్గా.. దేవరకద్రకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి దొరికింది. ఆ వెంటనే హైదరాబాద్ కు హుటాహుటిన బయలుదేరిన ఆయన.. మంత్రి గారి వద్దకు స్వయంగా వెళ్లి.. సదరు కడియాన్ని అప్పగించారు. జరిగిన దానికి చింతించినట్లుగా తెలిసింది. మంత్రిగారి కడియం దొరకటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రకటించిన రూ.లక్ష నజరానా ను కడియం తీసుకొచ్చిన వ్యక్తికి అప్పగించారా? అన్న క్వశ్చన్ కు మాత్రం ఆన్సర్ దొరకటం లేదు.