Begin typing your search above and press return to search.
తలసాని ఎంత లక్కీనో తెలుసా?
By: Tupaki Desk | 11 Oct 2017 9:03 AM GMTసీనియర్ రాజకీయ నేత - తెలంగాణ కేబినెట్‌లో కీలక శాఖ మంత్రిగా ఉన్న టీఆర్ ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ నిజంగానే లక్కీ ఫెలో అనే చెప్పాలి. ఎందుకంటే.. నేటి ఉదయం ఆయన ఓ ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. తాను ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ బలంగా గుద్దేసినా కూడా తలసానికి చిన్న గాయం కూడా కాలేదట. నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదం తెలంగాణ కేబినెట్ తో పాటు టీఆర్ ఎస్ నేతలను భారీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. సదరు ప్రమాదంలో తలసాని చిన్న గాయం కూడా కాకుండా బయటపడగా, ఆయనతో పాటు కారులో కూర్చున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయట.
ఈ ప్రమాద ఘటన పూర్తి వివరాల్లోకెళితే... మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం శంకుస్థాపనకు మంత్రి తలసాని నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరారు. మంత్రితో పాటు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి కూడా ఆ కారులో ఎక్కారు. తలసాని ముందు సీటులో డ్రైవర్ పక్కగా కూర్చోగా, సుధీర్ రెడ్డి మాత్రం వెనుక సీటులో కూర్చున్నారట. ఈ క్రమంలో వారు మేడ్చల్ చేరుకోకముందే... కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైన వారి కారును ఓ లారీ బలంగానే ఢీకొట్టేసింది. కారు వెనునకాలే వస్తున్న మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న సదరు లారీ... జెట్ స్పీడుతో వచ్చి తలసాని కారును ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో కారు వెనుక భాగం బాగా దెబ్బ తిన్నది.
కారు వెనుక భాగం డ్యామేజీ అయ్యేంతగా లారీ ఢీకొన్నా కారులోని తలసానికి చిన్న గాయం కూడా కాలేదట. అయితే కారు వెనుక సీటులో కూర్చున్న సుధీర్ రెడ్డికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అసలు తలసానికి ఏమైందన్న ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో కనిపించింది. అయితే తలసానికి ఏమీ కాలేదని, ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకున్న తర్వాత వారి మనసు కుదుట పడిందట. ఏదేమైనా ఇంత పెద్ద ప్రమాదం నుంచి తలసాని చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారంటే... నిజంగానే ఆయన లక్కీనే అని చెప్పాలి.