Begin typing your search above and press return to search.
ఆ సమస్యలకు 9849555778 నెంబరుకు ఫోన్ చేయాలన్న టీ మంత్రి
By: Tupaki Desk | 30 Jan 2020 4:42 AM GMTఆ మధ్యన వచ్చిన శివమణి సినిమా గుర్తుందా? నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీసు అధికారి అయిన నాగ్.. తన ఫోన్ నెంబరు ఓపెన్ గా ఇచ్చేస్తాడు. సమస్యలుంటేచాలు ఫోన్ చేయాలంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తాడు. కట్ చేస్తే.. ఈ సినిమా స్ఫూర్తితో కానీ.. నిజంగానే సమస్యల్ని తీర్చాలన్న ఉద్దేశంతో తర్వాతి కాలంలో పలువురు రాజకీయ నేతలు తమ ఫోన్ నెంబర్లు ఇచ్చి పెద్ద సాహసమే చేశారు. ఆ తర్వాత కొద్ది కాలం వరకూ తామిచ్చిన నెంబర్ల ఫోన్ ను స్విచ్ఛాప్ చేసే వారు. పబ్లిక్ కు ఫోన్ నెంబరు ఇస్తే ఇన్ని తలనొప్పులా అంటూ వాపోయిన నేతలు లేకపోలేదు.
ఇలాంటి అనుభవాల తర్వాత కూడా తెలంగాణ రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా తన ఫోన్ నెంబరు ఇచ్చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని కొందరు ఉన్నత అధికారులు వేధిస్తున్న విషయం తన వరకూ వచ్చిందన్న ఆయన.. అలాంటి ఉద్యోగులు తనకు ఫోన్ చేయాలంటూ తన నెంబరును ఇచ్చారు. బాధితులు ఎవరైనా తన నెంబరు 9849555778కు ఫోన్ చేస్తే.. అందుకు కారణమైన వారి పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆర్టీసీ నష్టాల్ని తీర్చేందుకు వీలుగా అందుకు కారణమైన ప్రైవేటు వాహనాల్ని ఇక పై ఆర్టీసీ రూట్లలో నడపమని స్పష్టం చేసిన ఆయన.. రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్సుల పై ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మల్ని ముద్రిస్తామని స్పష్టం చేశారు. ఫోన్ నెంబరు ఇవ్వటం.. ఆర్టీసీ బస్సుల పై సీఎంసారు ఫోటోల్ని వేయటం లాంటి వాటితో మరెలాంటి సమస్యల్ని మంత్రి పువ్వాడ ఎదుర్కొంటారో చూడాలి.