Begin typing your search above and press return to search.

చంద్రబాబు గాలి తీసేసిన తెలంగాణా మంత్రులు

By:  Tupaki Desk   |   26 Jun 2021 11:30 AM GMT
చంద్రబాబు గాలి తీసేసిన తెలంగాణా మంత్రులు
X
'ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు' అనే సామెతలాగ అయిపోయింది చంద్రబాబునాయుడు వ్యవహారం. కొద్దిరోజులుగా తెలంగాణా-ఏపి మధ్య జల జగడాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణా ప్రాజెక్టులకు దక్కాల్సిన న్యాయబద్దమైన నీటిని జగన్మోహన్ రెడ్డి ఏపికి తీసుకుపోతున్నట్లుగా తెలంగాణా మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ముందు జగన్ను తిట్టారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను బూతులు తిడుతున్నారు.

అప్పట్లో తండ్రి, ఇపుడు కొడుకు వల్ల తెలంగాణా ప్రాంతానికి నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిపోతున్నట్లు మంత్రులు మండిపోతున్నారు. పనిలోపనిగా మంత్రులు చంద్రబాబునాయుడు గురించి మాట్లాడిన మాటలు ఆయన గాలి తీసేసినట్లవుతోంది. తండ్రి, కొడుకుల గురించి మంత్రులు నోటికొచ్చినట్లు తిడుతున్నది జగన్ కు ప్లస్ గానే మారుతోంది. ఎందుకంటే ఏపి ప్రజానీకం కోసం అప్పట్లో వైఎస్సార్ అయినా ఇపుడు జగన్ అయినా ఎంతకైనా తెగిస్తారనే విషయం ఏపి జనాలకు స్పష్టంగా అర్ధమవుతోంది.

ఇదే సమయంలో తెలంగాణా మంత్రులు చంద్రబాబు గురించి చెప్పినమాటలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకే కాకుండా టీడీపీకి కూడా మైనస్ అవుతోంది. ఇంతకీ చంద్రబాబు గురించి మంత్రులు చెప్పిందేమంటే రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖలు ఇవ్వకుండా ఉండుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు. అప్పుడు తెలంగాణా ప్రాంతానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతునే ఉండేదన్నారు. మంత్రులు చెప్పిన దానిబట్టి తెలంగాణా విభజన చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే జరిగిందని ఏపి జనాలకు స్పష్టంగా అర్ధమవుతోంది.

మరి చంద్రబాబు మాత్రం ఇంతకాలం మన అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తెలంగాణా విభజనకు మొదటి ఓటు వేసిందే టీడీపీ అంటు అప్పట్లో మహబూబ్ నగర్ బహిరంగసభలోనే చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏపికి వచ్చి విభజనకు టీడీపీకి సంబంధం లేదని కూడా ఆయనే చెప్పారు. ఇలా ఒక్కోచోట ఒక్కోలా మాట్లాడిన చంద్రబాబు అసలు నైజాన్ని తెలంగాణా మంత్రులు బయటపెట్టేశారు.