Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రుల కేరాఫ్ అడ్రస్ లు మారాయి

By:  Tupaki Desk   |   29 Sep 2019 7:04 AM GMT
తెలంగాణ మంత్రుల కేరాఫ్ అడ్రస్ లు మారాయి
X
సచివాలయాన్ని తరలించటం తెలిసిందే. రేపో మాపో సచివాలయానికి తాళం కూడా వేసేయనున్నారు. ఎవరికైనా ఏదైనా పని ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్ కే జోషి వద్ద తాళాలు ఉంటాయని.. ఆయన వద్దకు వెళ్లి తీసుకోవాలని చెబుతున్నారు. ఇదంతా అయ్యే పని కాదనుకోండి. ఇదిలా ఉంటే.. సచివాలయానికి తాళాలు వేయటం.. సెక్రటేరియట్ ను బీఆర్కే భవన్ కు మార్చిన నేపథ్యంలో మంత్రులు ఎక్కడ ఉంటారన్నది క్వశ్చన్ గా మారింది.

సచివాలయం మార్పుతో పేషీల్ని కోల్పోయిన మంత్రులకు.. తాత్కాలికంగా పేషీల్ని ఏర్పాటు చేసే కసరత్తును పూర్తి చేశారు. కొందరు మంత్రులకు మాత్రమే బీఆర్కే భవన్ లో పేషీలను ఏర్పాటు చేశారు. మిగిలిన మంత్రులను వేర్వేరుప్రాంతాల్లోని ఆఫీసుల్లో పేషీల్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రుల కేరాఫ్ అడ్రస్ మారిపోయింది. నిన్నటి వరకూ వివిధ మంత్రులు ఒక్కో బ్లాక్ లో ఉండేవారు.

అందుకు భిన్నంగా సిటీలోని పలు ప్రాంతాల్లోని భవనాల్లో మంత్రులు ఉండనున్నారు. ఏ మంత్రి ఎక్కడ ఉండనున్నారన్నది చూస్తే..

మంత్రి ఇప్పుడు ఉండేది ఎక్కడంటే..

కేటీఆర్ మాసాబ్ ట్యాంక్ సీడీఎంఏ కార్యాలయం
హరీశ్ రావు లక్డీకాఫూల్ అరణ్య భవన్
సబితా ఇంద్రారెడ్డి బషీర్ బాగ్ ఎస్సీఈఆర్టీ
గంగుల కమలాకర్ ఖైరతాబాద్ బీసీ భవన్
సత్యవతి రాథోడ్ సంక్షేమ భవన్
పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్
మహమూద్ అలీ లక్డీకాఫూల్ ఏపీ డీజీపీ ఆఫీస్
ఇంద్రకరణ్ రెడ్డి బొగ్గులకుంట ఎండోమెంట్ కార్యాలయం
తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్కే భవన్
జగదీశ్ రెడ్డి మింట్ కాంపౌండ్ టీఎన్ఎస్సీడీసీఎల్
ఈటల రాజేందర్ బీఆర్కే భవన్
సింగిరెడ్డి నిరంజనరెడ్డి లక్డీకాఫూల్ హుడా భవన్
కొప్పుల ఈశ్వర్ సంక్షేమ భవన్
ఎర్రబెల్లి దయాకర్ రావు ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జెడ్పీ కార్యాలయం
శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి
వేముల ప్రశాంత్ రెడ్డి ఎర్రమంజిల్ ఈఎన్సీ
సీహెచ్. మల్లారెడ్డి జూబ్లీహిల్స్ మహిళా శిశుసంక్షేమ భవన్