Begin typing your search above and press return to search.
తెలంగాణ మంత్రులు అసూయ పడేలా చేస్తున్నజగన్!
By: Tupaki Desk | 11 Jun 2019 8:10 AM GMTస్వల్ప వ్యవధిలో ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరిస్తూ పాలన అందిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కారణంగా ఇప్పుడు కొత్త తరహా అనుభవాలు ఎదురవుతున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని.. ఆయన పాలనా తీరును చూసి తెలంగాణకు చెందిన మంత్రులు ఇప్పుడు అసూయ పడుతున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ కంటే తామే మిన్నగా ఫీలైన వారంతా.. మాతో పోలిస్తే మీరే బెటర్ అంటూ లోగుట్టు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు ఉండవని.. తమ శాఖకుచెందిన ఏ నిర్ణయాన్ని తాము తీసుకోవటానికి అవకాశం లేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు మంత్రులు. పేరుకు మంత్రులమే కానీ.. తమ మాట వినే అధికారులు ఉండరని.. అన్ని నిర్ణయాల్ని ముఖ్యమంత్రే తీసుకుంటారని చెబుతుంటారు.
అందుకు భిన్నంగా.. నేను పని చేస్తా.. నాతో పాటు మీరు పని చేయాలన్న సంకేతంతో పాటు.. మంత్రులకు పెద్దపీట వేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన జగన్ తీరుకు తెలంగాణ మంత్రులు అసూయతో రగిలిపోతున్నట్లుగా చెబుతున్నారు.
మంత్రులు డమ్మీలు కాదు.. వారికి అన్ని వివరాలు తెలియాల్సిందే. మొదట వారికి ఫైల్ చూపించి.. విషయాల మీద వారికి అవగాహన కలిగిన తర్వాతే నా దగ్గరకు ఫైల్ తీసుకోవాలంటూ మంత్రుల ఎదుటే సీనియర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో ఏపీ మంత్రులు ఖుషీ కాగా.. ఈ విషయాల్ని తెలుసుకుంటున్న తెలంగాణ మంత్రులు.. మాతో పోలిస్తే మీరే బెటర్. మీ ముఖ్యమంత్రి మస్తుగా పని చేస్తుండంటూ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకూ పాలన విషయంలో ఏపీ కంటే తామే ముందున్నట్లుగా చెప్పుకునే టీ మంత్రులు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.