Begin typing your search above and press return to search.
మరీ ఇంత నీరసమా; హడావుడే కనిపించట్లేదు
By: Tupaki Desk | 26 Dec 2015 7:05 AM GMTఇవాల్టి.. రేపటి రోజున చిన్న చిన్న ఎన్నికలకు సైతం మీడియా పతాక శీర్షికల్లోకి ఎక్కటం.. విపరీతమైన ఆసక్తి వ్యక్తం కావటం తెలిసిందే. అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థలకు జరుగుతున్న 12 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందడి లేకపోవటం గమనార్హం. గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హాట్ హాట్ సంఘటనలు చోటు చేసుకోవటమే కాదు.. ఓటుకు నోటు వ్యవహారం ఎంత రచ్చ చేసిందో తెలిసిందే.
తాజాగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ఏకపక్షంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే.. వాటిల్లో ఆరు స్థానాలు ఇప్పటికే తెలంగాణ అధికారపక్షం ఏకగ్రీవం కానిచ్చేయటం తెలిసిందే. ఇక.. మిగిలింది ఆరు స్థానాలు మాత్రమే. ఈ ఆరు స్థానాల్లో ఒకట్రెండు స్థానాల్లో ప్రతిపక్షాలు ముందంజలో ఉన్నట్లుగా వార్తలు వినిపించినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాణుక్యం పుణ్యమా అని ఆరు స్థానాల్లో ఇప్పటికే టీఆర్ ఎస్ అధిక్యత ప్రదర్శిస్తుందన్న మాట వినిపిస్తోంది.
కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఎన్నికల్లో కీలకమైన వారికి సంబంధించిన అన్నీ అంశాల్ని తెలంగాణ అధికారపక్షం ‘సెట్’ చేసిందని.. ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్న మాట గులాబీ బ్యాచ్ నుంచి వినిపిస్తోంది. టీఆర్ ఎస్ నేతలు మంత్రాంగంతో నామినేషన్ల పర్వంలోనే చేతులెత్తేసిన తెలంగాణ విపక్షాలు.. కారు నేతల దూకుడుకు నీరసపడిపోతున్న పరిస్థితి. ఎంత ప్రయత్నించినా తెలంగాణ అధికారపక్షం దూకుడుకి తట్టుకోలేమన్న భావన విపక్షాల్లో పూర్తిగా నిండిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలా విపక్షాల మీద మానసికంగా ఇప్పటికే విజయం సాధించిన గులాబీ బ్యాచ్.. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన బాధ్యతల్ని అప్పగించేసి గుంభనంగా ఉండిపోయింది. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న అయుత చండీయాగం పుణ్యమా అని తెలంగాణలోని అన్నీ వర్గాలకు చెందిన వారి దృష్టి ప్రస్తుతం యాగం మీద ఉంది. యాగం జోరులో.. ఆరుస్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం జరుగుతున్నా.. ముందు రోజు కూడా చడీ చప్పుడు లేని పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.